Cashews: ప్రతి రోజూ జీడిపప్పు తింటున్నారా? క్యాన్సర్, మైగ్రేన్‌ ఇంకా..

ప్రతి రోజూ ఆహారంతోపాటు జీడిపప్పు పలుకులు నాలుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇవి రుచికి అద్భుతంగా ఉంటాయి. అందుకే జీడిపప్పును అనేక ఆహార పదార్థాలు, స్వీట్లలో ఉపయోగిస్తుంటారు. జీడిపప్పును..

Cashews: ప్రతి రోజూ జీడిపప్పు తింటున్నారా? క్యాన్సర్, మైగ్రేన్‌ ఇంకా..
Cashew
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 30, 2022 | 5:56 PM

Benefits of eating cashew on empty stomach: ప్రతి రోజూ ఆహారంతోపాటు జీడిపప్పు పలుకులు నాలుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇవి రుచికి అద్భుతంగా ఉంటాయి. అందుకే జీడిపప్పును అనేక ఆహార పదార్థాలు, స్వీట్లలో ఉపయోగిస్తుంటారు. జీడిపప్పును స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. నిజానికి డ్రైఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్లు, పొటాషియం, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా జీడిపప్పును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చర్మానికి, కంటి ఆరోగ్యానికి జీడిపప్పు ఉపయోగపడుతుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..

బరువును నియంత్రణలో ఉంచుతుంది జీడిపప్పును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని మీకు తెలుసా? అవును.. జీడిపప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. శరీరంలోని అనవసర కొవ్వును తగ్గిస్తుంది. జీడిపప్పు తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్ చార్టులో జీడిపప్పును చేర్చుకోవచ్చు.

చర్మం కాంతి మెరుగుపడుతుంది జీడిపప్పులో కాపర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. వీటితోపాటు సెలీనియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాలన్నీ చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పించి, చర్మం మెరిసేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

కంటి ఆరోగ్యానికి దివ్యౌషధం జీడిపప్పులో లుటిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతాయి. జీడిపప్పులో ఉండే ఈ పోషక గుణాల వల్ల ఎండ నుంచి కళ్లకు రక్షణ కల్పించి, ఎల్లవేళలా కాపాడుతుంటుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచి, కంటి చూపును సంరక్షిస్తుంది.

మైగ్రేన్‌ నుంచి ఉపశమనం మెగ్నీషియం లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయం తెలిసిందే. జీడిపప్పులో మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే జీడిపప్పు తీసుకోవడం వల్ల మైగ్రేన్ నొప్పి కూడా తగ్గుముఖం పడుతుంది.

క్యాన్సర్‌ నివారణలో కూడా మేటి.. జీడిపప్పు తినడం వల్ల కలిగే అనేకానేక ప్రయోజనాల్లో ఒకటి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం. దీనిలో ప్రొయాంథోసైనిడిన్ ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి, క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే జీడిపప్పును క్రమం తప్పకుండా తినడం మర్చిపోకూడదు.

గుండె ఆరోగ్యానికి మేలు.. జీడిపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్, మంచి కొవ్వులు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?