AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొలకెత్తిన శనగలు వర్సెస్‌ మొలకెత్తిన పెసలు దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయో తెలుసా..?

మొలకెత్తిన పెసలు, శనగలు, వేరుశనగలు, అలసందలు. సజ్జలు, ఇతర గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అందుకే చాలా మంది పరగడుపున మొలకలు తినడం అలవాటుగా చేసుకుంటున్నారు. అయితే, మొలకెత్తి శనగలు, పెసలు ఈ రెండింటిలో ఏవి ఎక్కువ పోషకమైనవో తెలుసా..?

మొలకెత్తిన శనగలు వర్సెస్‌  మొలకెత్తిన పెసలు దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయో తెలుసా..?
Sprouts
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2025 | 9:39 PM

Share

100 గ్రాముల మొలకెత్తిన నల్లశనగలలో 20.5 గ్రాముల ప్రోటీన్, 12.2 గ్రాముల ఫైబర్, 57 మి.గ్రా కాల్షియం ఉంటాయి. నల్లశనగలలో 4.31 mg ఇనుము, 718 mg పొటాషియం లభిస్తాయి. మొలకెత్తిన శనగలను రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె ఆరోగ్యానికి మంచిది.

మొలకెత్తిన పెసలలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పెసర మొలకలలో 23.9 గ్రాముల ప్రోటీన్, 16.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పెసర మొలకలు 132 mg కాల్షియం, 6.74 mg ఇనుము, 1250 mg పొటాషియం, 4.8 mg విటమిన్ సి కలిగి ఉంటాయి.

మొలకెత్తిన పెసలు బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇక మొలకెత్తిన పెసలు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో మొలకెత్తిన పెసలు సహాయపడుతాయి.

ఇవి కూడా చదవండి

మొలకెత్తిన పెసలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తపోటు, రోగనిరోధక పనితీరును కూడా నియంత్రిస్తుంది. అయితే, పోషక విలువల పరంగా, పెసర మొలకలు శనగల కంటే మెరుగైనవి అంటున్నారు నిపుణులు. అయితే, పూర్తి పోషకాహారం పొందడానికి, రెండింటినీ కలిపి తినడం ఉత్తమం అంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..