పొట్టు మినపప్పు తింటే పుట్టెడు లాభాలు.. వెంటనే మొదలుపెట్టేయండి..!
మినపప్పు అంటేనే పోషకాల గని. వీటిలో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియంతోపాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మినపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగు పరచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పు కేవలం వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాదు.. దీనిని తీసుకోవడం వల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.

పొట్టు మినపప్పు, అనగా గింజ తొక్కు తొలగించకుండా ఉంచిన మినపప్పు. పొట్టు మినపప్పులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పొట్టు మినపప్పులో ఉండే బి-విటమిన్లు , ఇతర ఖనిజాలు మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన పొట్టు మినపప్పు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మినపప్పు అంటేనే పోషకాల గని. వీటిలో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియంతోపాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మినపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగు పరచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పు కేవలం వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాదు.. దీనిని తీసుకోవడం వల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. అందుకే ఈ పప్పును పోషకాల గని అని అంటారు.
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు.. మినప పప్పుతో చేసిన వంటకాలు ప్రతీ రోజు డైట్లో చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. పొట్టు మినపప్పుతో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. పొట్టు తీయని మినప పప్పును తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనకరం. ఈ పప్పులో పుష్కలంగా ఉండే ఫైబర్, ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయంటున్నారు.
మినప పప్పులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ పప్పు.. కిడ్నీల సంరక్షణకు మరింత మంచిది. మినప పప్పులో సమృద్ధిగా ఉండే కాల్షియం, పాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మరింత మంచిది. మినప పప్పు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.ఈ పప్పులోని పోషకాలు సన్ టాన్స్, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. ఈ పప్పుతో జుట్టు సంరక్షణకు మేలు జరుగుతుంది.
పొట్టు మినపప్పు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే పప్పులలో ఒకటి. ఇది పోషక పదార్థాల్లో సమృద్ధిగా ఉండి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. పొట్టు మినపప్పులో ఉండే పోషకాలు శరీర కండరాల అభివృద్ధి కోసం అత్యవసరమైన ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. జీర్ణశక్తి కోసం దీనిలో ఉన్న ఆహార ఫైబర్ ఉపయోగపడుతుంది.
పొట్టు మినపప్పులో ఫైబర్ అధికంగా ఉండడం వలన జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. పేగుల్లో వ్యర్థాలను సులభంగా బయటకు పంపే విధంగా ఇది సహాయపడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. దీనిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఎముకల ఆరోగ్యానికి పెంపొందిస్తాయి. B విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఐరన్ అధికంగా ఉండటం వలన రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఇది మంచిదిగా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా దీనిని తీసుకోవడం వల్ల ఉపయోగాలు పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








