Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌.. స్మార్ట్ ఫోన్ అతి వాడకంతో పిల్లల్లో ఇన్ని సమస్యలా..? తాజా సర్వే రిపోర్ట్ తెలిస్తే..

స్మార్ట్ ఫోన్ అతి వినియోగం చాలామందిలో కొన్ని వ్యసనాలకు, అనర్థాలకు దారితీస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఈ అంశంపై రీసెంట్ స్టడీ మరో కొత్త విషయాన్ని తెలిపింది. చిన్నపిల్లలు టీనేజర్లు దీనిని ఎక్కువగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు.. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. స్మార్ట్‌ ఫోన్‌ అతి వాడకం వల్ల పిల్లల్లో ఎలాంటి సమస్యలను తెచ్చిపెడుతుందో పూర్తి వివరాల్లోకి వెళితే..

బాబోయ్‌.. స్మార్ట్ ఫోన్ అతి వాడకంతో పిల్లల్లో ఇన్ని సమస్యలా..? తాజా సర్వే రిపోర్ట్ తెలిస్తే..
Side Effects Of Mobile
Yellender Reddy Ramasagram
| Edited By: Jyothi Gadda|

Updated on: Mar 02, 2025 | 1:07 PM

Share

స్మార్ట్ ఫోన్ అతి వినియోగం చాలామందిలో కొన్ని వ్యసనాలకు, అనర్థాలకు దారితీస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఈ అంశంపై రీసెంట్ స్టడీ మరో కొత్త విషయాన్ని తెలిపింది. చిన్నపిల్లలు టీనేజర్లు దీనిని ఎక్కువగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు.. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. స్మార్ట్‌ ఫోన్‌ అతి వాడకం వల్ల పిల్లలు, యువతీ, యువకుల్లో ఎలాంటి సమస్యలను తెచ్చిపెడుతుందో పూర్తి వివరాల్లోకి వెళితే..

సర్వేలో భాగంగా 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సున్న 10,000 మందిని స్మార్ట్ ఫోన్ యూజర్లను పరిశీలించారు. వీళ్ళు అతిగా వాడే వారిని, తక్కువగా వాడేవారిని కేటగిరీలుగా విభజించి అబ్జర్వ్ చేశారు. ఒత్తిడి,ఆందోళనలు,మానసిక పరిస్థితిలో మార్పులు ఎవరిలో ఏ విధంగా ఉంటున్నాయో కూడా విశ్లేషించారు. ఈ సందర్భంగా నిపుణులు స్మార్ట్ఫోన్ అతి వినియోగం అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా ఆందోళన, ఓత్తిడి వంటి సమస్యలకు దారితీస్తున్నట్లు గుర్తించారు.ఓవరాల్ గా చూస్తే 65% మంది ఆడపిల్లలు స్మార్ట్ఫోన్ అతి వినియోగం ఆందోళనకు కారణం అవుతుంది.

స్మార్ట్ ఫోన్ అతి వినియోగం వ్యసనంగా మారినప్పుడు పిల్లల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు డెవలప్ అవుతాయని పరిశోధకులు చెప్పారు. చికాకు కోపం సిజిఎస్ బిహేవియర్ డెవలప్ అవుతాయి. ఫోన్ ఇవ్వకపోతే అందుబాటులో లేకపోతే అలగడం ఏదైనా హాని చేసుకుంటామని పేరెంట్స్ ను బెదిరించడం వంటి ప్రవర్తన కూడా కనిపించవచ్చు. వాస్తవానికి దూరంగా భ్రమలో మునిగితేలుతుంటారు. రీల్స్,సోషల్ మీడియాలోని పలు రకాల కంటెంట్ దీనికి కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. పిల్లల్లో స్క్రీన్ టైమ్ తగ్గించడం టెక్నాలజీ పట్ల అవగాహన పెంచడం ద్వారా పిల్లల్లో స్మార్ట్ఫోన్ అతి వినియోగాన్ని అరికట్టవచ్చు అని నిపుణులు సూచన.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..