Bald Head Problems: బట్టతలతో కూల్‌డ్రింక్స్‌కి లింక్ ఏంటీ..? తాజా పరిశోధనలో విస్తుపోయే నిజాలు..

కూల్ డ్రింక్స్ తాగే మగవారిలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటారని వెల్లడైంది. కేవలం కూల్ డ్రింక్స్ మాత్రమే కాఫీ, టీ తాగే వారికి ప్రమాదం పొంచి ఉంది. సాధారణమైన వ్యక్తుల కంటే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ , కాఫీ, టీ తాగే వారు దాదాపు 30 ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో బాధపడతారని బయటపడింది.

Bald Head Problems: బట్టతలతో కూల్‌డ్రింక్స్‌కి లింక్ ఏంటీ..? తాజా పరిశోధనలో విస్తుపోయే నిజాలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2023 | 6:07 PM

సాధారణంగా దాహం వేసినప్పుడు లేదా ప్రయాణ సమయంలో, ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లినప్పుడు కచ్చితంగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. ప్రస్తుతం చాలామంది డైలీ కూల్ డ్రింక్స్ తాగుతూనే ఉంటారు. అయితే ఇటీవల పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూల్ డ్రింక్స్ తాగే మగవారిలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటారని వెల్లడైంది. కేవలం కూల్ డ్రింక్స్ మాత్రమే కాఫీ, టీ తాగే వారికి ప్రమాదం పొంచి ఉంది. సాధారణమైన వ్యక్తుల కంటే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ , కాఫీ, టీ తాగే వారు దాదాపు 30 ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో బాధపడతారని బయటపడింది. ఓ పోషకాహార పత్రికలో వచ్చిన కథనం ప్రకారం దాదాపు ప్రతి పురుషుడు వారానికి ఒకటి నుంచి మూడు లీటర్ల వరకూ పానియాలను తాగుతుంటారని నిపుణులు పేర్కొన్నారు. 

డ్రింక్స్ తాగని వారితో పోల్చుకుంటే ఎక్కువసార్లు డ్రింక్స్ తాగే దాదాపు 42 శాతం మంది హెయిర్ ఫాల్ తో సతమతమవుతున్నారు. జుట్టు రాలే వారు వారానికి 12 సార్లు డ్రింక్స్ తాగితే..ఆ సమ్యతో బాధపడని వారు కేవలం వారానికి ఏడు రోజులు మాత్రమే డ్రింక్స్ తాగావారు. దాదాపు నాలుగు నెలల పాటు 1000 మంది పురుషుల్లో పరిశోధన చేసినట్టు ఆ జర్నల్ పేర్కొంది. అయితే జుట్టు రాలడానికి కేవలం కూల్ డ్రింక్స్ తాగడమే కారణం కాదు..ఫాస్ట్ ఫుడ్స్ తినే పురుషుల్లో కూడా ఈ సమస్యను కనుగొన్నారు. అలాగే ఆహార అలవాట్లు, మానసిక ఒత్తిడి సమస్య ఉన్న వారిలో కూడా హెయిర్ ఫాల్ సమస్య అధికంగా ఉంది. 

సరైన ఆహార అలవాట్లే రక్షణ

శరీరం వేగంగా విభజించే కణాల్లో హెయిల్ ఫాలికల్ కణాలు రెండో స్థానంలో ఉన్నాయి. కాబట్టి సమతుల్యంగా ఉండే పౌష్టికాహారాన్ని తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా లీన్ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమపాలల్లో అందుతాయి. అయితే పోషకాహార లోపం, క్రాస్ డైట్ లు జుట్టును బలహీన పరుస్తాయి. అలాగే జుట్టు అధికంగా రాలేలా చేస్తాయి. అయితే  జుట్టు రాలడం అనేది సాధారణ సమస్య ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎందుకంటే మామూలుగా మనకు తెలియకుండానే రోజూ 50 వెంట్రుకలు వరకూ రాలతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం