కడుపు నొప్పికి సింపుల్‌ చిట్కాలు.. 

Narender Vaitla

04 December 2024

సరిపడ నీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి నుంచి బయటపడొచ్చు. అజీర్ణం సమస్యను దూరం చేయడంలో మంచి నీరు ఉపయోగపడుతుంది.

కడుపు నొప్పి వచ్చిన సమయంలో అదే పనిగా పడుకోడదు. కాసేపు అటు, ఇటు నడవడం వల్ల కూడా కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

కడుపు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభించాలంటే నోట్లో ఒక అల్లం ముక్క వేసుకొని చప్పరించాలి. దీంతో అజీర్తి, గ్యాస్‌, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.

వాము కూడా కడుపు నొప్పి నుంచి ఉపశమం కలిగిస్తాయి. వాములో కొంత ఉప్పు కలుపుకుని తీసుకుంటే వెంటనే గ్యాస్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది.

దానిమ్మ జ్యూస్‌ తీసుకోవడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ జ్యూస్‌ కడుపు నొప్పికి సత్వర ఉపశమనంగా చెప్పొచ్చు.

కడుపు నొప్పికి తక్షణ ఉపశమనం కల్పించడంలో గోరు వెచ్చని నీరు సహాయపడుతుంది. ముఖ్యంగా కడుపులో పేరుకుపోయిన గ్యాస్‌ తగ్గుతుంది.

రాత్రంతా నానబెట్టిన జీలకర్ర నీటిని ఉదయం తీసుకోవాలి. ఇలా రోజూ పడగడుపున తీసుకుంటే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు సూచనలు పాటించడమే ఉత్తమం.