చలికాలం తేనె తింటే జరిగేది ఇదే.. 

Narender Vaitla

04 December 2024

చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో తేనె ఉపయోగపడుతుంది. తేనెను రెగ్యులర్‌గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

చలికాలంలో చుండ్రులాంటి జుట్టు సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే తేనెను తీసుకోవడం ద్వారా జుట్టు రాలడం నుంచి ఉపశమనం లభిస్తుంది.

జీర్ణ సంబధిత సమస్యలను కూడా దూరం చేయడంలో తేనె ఉపయోగపడుతుంది. ఉదయాన్నే పడగడుపు ఒక చెంచా తేనే తీసుకుంటే కడుపు శుభ్రంగా మారుతుంది.

చలికాలంలో చర్మం పాలిపోవడం, పొడిబారిపోవడం లాంటి సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే తేనెను తీసుకుంటే ఈ సమ్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

చలికాలంలో సహజంగా నీరసం ఎక్కువగా ఉండడం కామన్‌. అయితే ఉదయాన్నే తేనె తీసుకుంటే రోజంతటికీ కావాల్సిన్‌ ఇన్‌స్టాంట్‌ శక్తి లభిస్తుంది.

డయాబెటిస్‌ బాధితులకు కూడా తేనె బాగా ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ తేనెను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి.

నిద్రలేమి సమస్యను దూరం చేయడంలో కూడా తేనె బాగా ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ తేనెను తీసుకుంటే మంచి నిద్ర సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.