Hair Care Tips: తలకు నూనె రాసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకుంటే హెయిర్ ఊడిపోయే అవకాశం..

Hair Care Tips: తలకు కొబ్బరి నూనె లేదా హెయిర్ ఆయిల్స్ రాసుకుంటే.. త్వరగా తెల్లబడకుండా, జుట్టు ఊడిపోకుండా ఉంటుందని చాలా మంది తలకు నూనె రాసుకుంటుంటాం. దీని ద్వారా జట్టు కుదుళ్లు బలంగా మారతాయి. అయితే కొన్ని సందర్భాల్లో..

Hair Care Tips: తలకు నూనె రాసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకుంటే హెయిర్ ఊడిపోయే అవకాశం..
Hair Care Tips
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 10, 2023 | 7:20 AM

Hair Care Tips: తలకు కొబ్బరి నూనె లేదా హెయిర్ ఆయిల్స్ రాసుకుంటే.. త్వరగా తెల్లబడకుండా, జుట్టు ఊడిపోకుండా ఉంటుందని చాలా మంది తలకు నూనె రాసుకుంటుంటాం. దీని ద్వారా జట్టు కుదుళ్లు బలంగా మారతాయి. అయితే కొన్ని సందర్భాల్లో నూనె రాస్తే జుట్టు ఊడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏయే సమయాల్లో తలకు నూనె రాయకూడదో తెలుసుకుందాం.. హెయిర్ కేర్ కు చాలా మంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జుట్టు మనిషి రూపాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే చాలా మంది జుట్టు సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇటీవల కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చాలామందికి జుట్టు రాలిపోవడం, త్వరగా జుట్టు తెల్లబడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా వరకు ఆహారం, పని ఒత్తిడి, మనం ఉండే వాతావరణం కారణంగానే జుట్టు రాలే సమస్యలు తలెత్తుతాయి. జుట్టు సంరక్షణ కోసం రకారకాల హెయిర్ అయిల్స్ కూడా వాడుతుంటారు. హెయిర్ ఆయిల్ వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో హెయిర్ ఆయిల్‌తో జుట్టుకు మసాజ్ చేయకూడదు. ఎలాంటి సమయాల్లో జుట్టుకు అయిల్ రాయకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే జుట్టు సమస్యలు మరింతగా పెరుగుతాయి. ఏయే సమయాల్లో హెయిర్ ఆయిల్స్ వాడకూడదో తెలుసుకుందాం.

జిడ్డుగా ఉన్నప్పుడు

తలపై చర్మం (SCALP) జిడ్డుగా ఉంటూ జుట్టుకు ఎక్కువ నూనె రాయకూడదు. జిడ్డు చర్మానికి నూనె రాసుకుంటే జుట్టు కింద చర్మంపై మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. దీని కారణంగా జుట్టు ఊడిపోతుంది. తలపై చర్మం జిడ్డుగా ఉన్నప్పటికి హెయిర్ ఆయిల్ రాయడం అలవాటుగా చేసుకుంటే జుట్టు మరింత ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంది.

తలపై చుండ్రు ఉన్నప్పుడు

జుట్టుకు చుండ్రు లేకుండా ఉండేందుకు సాధారణంగా నూనె రాసుకుంటాం. జుట్టుకు ఎక్కువ చుండ్రు ఉన్నట్లయితే నూనె రాసుకోకూడదు. చుండ్రు ఎక్కువుగా ఉన్నప్పుడు నూనె రాసుకోవడం వల్ల జుట్టులో చుండ్రు సమస్య మరింత తీవ్రమవుతుంది.

ఇవి కూడా చదవండి

తలపై బొబ్బలు ఉన్నప్పుడు

కొన్నిసార్లు తలపై జుట్టు కింద బొబ్బలు ఉంటాయి. ఈ సమయంలో జుట్టుకు నూనె రాయడం వల్ల పొక్కులు మరింతగా వ్యాపిస్తాయి. త్వరగా తగ్గడం కూడా కష్టమవుతుంది.

తల స్నానం చేసే సమయంలో

తల స్నానం చేయడానికి ముందు జుట్టుకు నూనె రాయకూడదు. తల స్నానానికి కనీసం గంట ముందు హెయిర్ ఆయిల్ తో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. రాత్రి పైట జుట్టును నూనెతో మసాజ్ చేసి ఉదయం పూట స్నానం చేయడం చాలా మంచిది. అయితే తన స్నానం చేయడానికి కొన్ని నిమిషాల ముందు మాత్రం నూనె రాసుకుని తల స్నానం చేయకూడదు. తల తడిగా ఉన్న సమయంలోనూ నూనె రాయకూడదు. ఆరిన తర్వాత రాసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..