Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు రాలిపోతుందా? మెంతులతో ఇలా కురులను కాపాడుకోండి..
Monsoon Hair Care Tips: వర్షాకాలం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వాతావరణంలోని మార్పులు ఆరోగ్యంపై కాకుండా జుట్టు, చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా జుట్టుకు సంబంధించి పలు సమస్యలు తలెత్తుతాయి.

Monsoon Hair Care Tips: వర్షాకాలం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వాతావరణంలోని మార్పులు ఆరోగ్యంపై కాకుండా జుట్టు, చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా జుట్టుకు సంబంధించి పలు సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్‌లో జుట్టు జిగటగా మారుతుంది. జుట్టు రాలడం, చివర్లు చిట్లడం వంటి సమస్యలు చికాకు తెప్పిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో జుట్టు సంరక్షణ కోసం చాలామంది మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు. అయితే ఒక్కోసారి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. ఈక్రమంలో జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉండేందుకు కొన్ని సహజ చిట్కాలను ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా వంటగదిలో ఉండే మెంతులు జుట్టు పోషణకు ఎంతో సహాయపడతాయి. ఇందులో విటమిన్లు ఎ, కె, సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీడితో చేసిన పొడి జుట్టు రాలడాన్ని నిషేధించడమే కాదు హెయిర్‌ను సిల్కీగా మారుస్తుంది. అంతేకాదు జుట్టు పెరుగుదలకు కూడా బాగా సహకరిస్తుంది. మరి జుట్టు సంరక్షణ కోసం మెంతులు ఉపయోగించే మార్గాల గురించి తెలుసుకుందాం రండి.
చుండ్రుకు ఉత్తమ నివారణ మెంతి పొడి చుండ్రును బాగా తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రును తొలగించడంలో బాగా సహాయపడతాయి.
జుట్టు రాలడాన్ని.. మెంతులు జుట్టు రాలడానికి దివ్యౌషధంగా భావిస్తారు. జుట్టు రాలడానికి కార్టిసాల్ కారణమని భావిస్తారు. మెంతి గింజలు కార్టిసాల్‌ను తగ్గించడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి.




జుట్టు నెరవడాన్ని.. చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతుంది. ఇలాంటివారికి మెంతులు మంచిగా ఉపయోగపడతాయి. పొటాషియం పుష్కలంగా ఉండే మెంతులు జుట్టు నెరసిపోవడాన్ని నివారిస్తాయి.
జుట్టు పోషణ కోసం.. వర్షాకాలంలో జుట్టు బాగా పాడైపోయి, పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జుట్టు కోసం మెంతులు ఉపయోగించాలి. మెంతులు జుట్టును మెరిసేలా చేస్తాయి. అంతేకాదు వెంట్రులకను సిల్కీగా, మృదువుగా మారుస్తాయి.
ఎలా ఉపయోగించాలంటే.. మెంతి గింజలను ఉపయోగించడానికి, మీరు ఒక మాస్క్ తయారు చేసి జుట్టుకు అప్లై చేయవచ్చు. దీని కోసం, ఒక కప్పు మెంతి గింజలను నీటిలో నానబెట్టి సుమారు ఎనిమిది గంటల పాటు ఉంచండి. దీన్ని మిక్సీలో బాగా గ్రైండ్ చేసి అందులో రెండు మూడు చెంచాల పెరుగు కలపాలి. దీని తర్వాత అలోవెరా జెల్ మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేయండి. సుమారు గంటసేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత జుట్టును నీటితో కడగాలి. కావాలంటే నూనెలో మెంతి గింజలు వేసి వేడి చేయాలి. శీతలీకరణ తర్వాత, ఈ నూనెను ఒక సీసాలో నింపండి. ఈ నూనెను జుట్టుకు మసాజ్ చేయడం ద్వారా కూడా చాలా ప్రయోజనాలను పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..