Health Tips: వర్షాకాలంలో విజృంభించే సీజనల్‌ వ్యాధులు.. ప్రమాదకరమైన డెంగ్యూ నుంచి రక్షణ పొందండిలా..

Monsoon Health Tips: వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి. వాతావారణంలోని మార్పులకు తోడు కలుషితమైన నీటి కారణంగా పలు సమస్యలు వెంటాడుతుంటాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు తోడు డెంగ్యూ లాంటి ప్రమాదకర వ్యాధులు ..

Health Tips: వర్షాకాలంలో విజృంభించే సీజనల్‌ వ్యాధులు.. ప్రమాదకరమైన డెంగ్యూ నుంచి రక్షణ పొందండిలా..
Monsoon Health Tips
Basha Shek

|

Jul 05, 2022 | 4:26 PM

Monsoon Health Tips: వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి. వాతావారణంలోని మార్పులకు తోడు కలుషితమైన నీటి కారణంగా పలు సమస్యలు వెంటాడుతుంటాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు తోడు డెంగ్యూ లాంటి ప్రమాదకర వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. డెంగ్యూకు నిర్దిష్ట చికిత్స లేదు కాబట్టి దీని పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే సరైన చికిత్స తీసుకోవాలి. జ్వరం, తలనొప్పి, కంటి నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు లేదా ఎముకల నొప్పి, వికారం లేదా వాంతులు వంటి డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అదేవిధంగా దోమల బెడదను అరికట్టడం, దోమలు కుట్టకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం వంటి చర్యలు తీసుకొనడం ద్వారా ఈ ప్రమాదకర వ్యాధిని అరికట్టవచ్చు.

  • డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఫుల్‌ స్లీవ్‌ల దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల దోమల బెడదను దాదాపు నివారించవచ్చు.
  • ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు దోమల నివారణ మందులను వాడండి.
  • సాయంత్రం వేళల్లో దోమలు చాలా చురుకుగా ఉంటాయి. కాబట్టి దోమలు ఇంట్లోకి రాకుండా సూర్యాస్తమయానికి ముందుదే ఇంటి తలుపులు, కిటికీలు మూసేయండి.
  • నిలిచిన నీరు మరియు మురికి ప్రదేశాలలో దోమలు చాలా త్వరగా వృద్ధి చెందుతాయి. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, టైర్లు, కుండలు, కుండీలు, డ్రమ్ములు, గజాలు లేదా ఇంటి సమీపంలోని గుంటలలో నీరు నిలువకుండా ఉండండి.
  • ఇంటి దగ్గర వ్యర్థాలను నిల్వచేయవద్దు. ఎప్పటికప్పుడు ఫాగింగ్ ప్రయత్నించండి.
  • సాధారణంగా దోమలు చీకటి ప్రదేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఇంటి పరిసరాల్లో సరైన లైటింగ్ ఉండేలా చూసుకోండి.
  • రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, చిక్కుళ్లు చేర్చుకోవాలి.
  • అదేవిధంగా రోగనిరోధక శక్తిని తగ్గించే జంక్, జిడ్డుగల, క్యాన్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగాన్ని తగ్గించండి.
  • అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సీజన్‌ లో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం తగినంత నీరు తాగండి, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu