Breakfast: తింటే ఈ బ్రేక్‌ఫాస్టే తినాలి.. గట్ హెల్త్‌కు ఏది బెస్టో డాక్టర్లే చెప్పేశారు!
ప్రతిరోజు ఉదయం మనం తీసుకునే అల్పాహారం మన ఆరోగ్యంపై, ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది. అయితే, మనం తినే ఆహారంలో ఏది గట్ హెల్త్‌కు మంచిది, ఏది చెడు అనే విషయం చాలామందికి తెలియదు. ఈ అంశంపై ఎంతోమంది నిపుణులు పరిశోధనలు చేసి, కొన్ని బ్రేక్‌ఫాస్ట్‌లకు ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ ర్యాంకింగ్‌లో ఏ అల్పాహారానికి మంచి మార్కులు వచ్చాయో, దేనికి తక్కువ మార్కులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

అల్పాహారం మనం తినే భోజనంలో చాలా ముఖ్యమైనది. ఇది మన గట్ హెల్త్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది. అయితే, గట్ హెల్త్‌కు ఏ అల్పాహారం మంచిది? ఏది చెడ్డది? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ ఈ విషయాలను వివరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన కొన్ని అల్పాహారాలకు వాటి గట్ హెల్త్ ప్రయోజనాల ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. డాక్టర్ సేథీ ర్యాంకింగ్ ప్రకారం, గట్ హెల్త్‌కు బాగా పని చేసే అల్పాహారాలకు 10 పాయింట్లు, చెడు చేసే వాటికి నెగెటివ్ మార్కులు ఇచ్చారు.
View this post on Instagram
అత్యుత్తమ అల్పాహారం:
పెరుగు, బెర్రీలు: 10/10
గుడ్లు, కూరగాయల స్క్రాంబుల్: 9/10
చియా లేదా అవిసె గింజలతో నానబెట్టిన ఓట్స్: 8/10
మధ్యస్థ అల్పాహారం:
పప్పు, కూరగాయలతో ఉప్మా లేదా సేవర్ ఓట్స్: 5/10
అరటిపండు, ఖర్జూరంతో ఓట్‌మీల్: 4/10
చెడు అల్పాహారం:
చక్కెర కలిపిన సీరియల్స్: -5/10
ఫాస్ట్ ఫుడ్ బురిటోలు: -10/10
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.




