AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: చెప్పులు వేసుకుని స్నానం చేస్తే ఏమవుతుందో తెలిస్తే షాకే.. మరోసారి ఆ తప్పు..

వాస్తు శాస్త్రం ప్రకారం.. స్నానం చేసిన తర్వాత కొన్ని తప్పులు చేయకూడదు. అలా చేస్తే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. మిగిలిన నీటిని బకెట్‌లో ఉంచడం, వస్తువులను చిందరవందరగా పడేయడం, చెప్పులతో స్నానం చేయడం వంటివి చేయకూడదు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: చెప్పులు వేసుకుని స్నానం చేస్తే ఏమవుతుందో తెలిస్తే షాకే.. మరోసారి ఆ తప్పు..
Bathing
Krishna S
|

Updated on: Sep 06, 2025 | 10:18 PM

Share

మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న అలవాట్లు మన భవిష్యత్తును, అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పులు ఆర్థిక సమస్యలు, ఇంట్లో అశాంతి, ప్రతికూలతను పెంచుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన అదృష్టాన్ని తిరిగి పొందవచ్చని వారు చెబుతున్నారు.

స్నానం తర్వాత చేయకూడనివి

బకెట్‌లో నీరు ఉంచడం: చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్‌లో మిగిలిన నీటిని అలాగే వదిలేస్తారు. వాస్తు ప్రకారం ఇది చాలా అశుభం. ఇలా చేయడం వల్ల రాహువు, కేతువు గ్రహాల ప్రతికూల ప్రభావం పెరుగుతుందని, ఇది ఆర్థిక నష్టం, ఇంట్లో గొడవలు, మానసిక అశాంతికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి స్నానం తర్వాత బకెట్‌ను ఖాళీ చేసి బోర్లించి ఉంచాలి.

చిందరవందరగా వస్తువులు : స్నానం తర్వాత సబ్బులు, షాంపూలు, బ్రష్‌లు వంటివి వాటి సరైన స్థానంలో ఉంచకపోతే వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. బాత్‌రూమ్‌ను ఎప్పుడూ శుభ్రంగా, వస్తువులను వాటి స్థానంలో ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

ట్యాప్ ఓపెన్: స్నానం చేసిన తర్వాత ట్యాప్ ఓపెన్ చేసి ఉంచడం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల నీరు వృథా అవడమే కాకుండా డబ్బు కూడా వృథా అవుతుందని, ఇది ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాస్తు, పరిశుభ్రత – కొన్ని ప్రత్యేక సూచనలు

చెప్పులు ధరించవద్దు: స్నానం చేసేటప్పుడు చెప్పులు ధరించడం వల్ల నీరు అపవిత్రం అవుతుందని, ఇది శుభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

నీరు నిలువడం: స్నానం చేసిన తర్వాత బాత్రూమ్‌ను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. నిలిచిపోయిన నీరు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.

జుట్టు: చాలామంది స్నానం చేసేటప్పుడు రాలిన జుట్టును బాత్‌రూమ్‌లో వదిలేస్తారు. ఇలా చేయడం ఇంట్లో ప్రతికూల వాతావరణానికి దారితీస్తుంది. కాబట్టి, రాలిన జుట్టును వెంటనే శుభ్రం చేయాలి.

వివాహిత మహిళలకు..

వాస్తు శాస్త్రం ప్రకారం, వివాహిత మహిళలు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

తడి జుట్టుతో సింధూరం: స్నానం తర్వాత జుట్టు తడిగా ఉన్నప్పుడు సిందూరం ధరించడం అశుభమని చెబుతారు. సిందూరం పెట్టుకునే ముందు జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలి.

తడి బట్టలు: స్నానం చేసిన తర్వాత తడి బట్టలను బాత్‌రూమ్‌లో ఉంచడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల రాహువు, కేతువు ప్రభావం పెరిగి, భర్త,  కుటుంబ సభ్యుల జీవితాలపై చెడు ప్రభావం పడుతుందని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.

ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా, అనవసరమైన సమస్యలను తగ్గించుకోవచ్చని, జీవితంలో ఆనందం, ఆర్థిక పురోగతిని సాధించవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ సూచనలు మన దైనందిన జీవితాన్ని మరింత సానుకూలంగా, సంతోషంగా మార్చుకోవడానికి సహాయపడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..