- Telugu News Photo Gallery Eggplant side effects: these five people should avoid brinjal for health reasons
ఈ 5 వ్యాధులతో బాధపడేవారికి వంకాయ విషం లాంటిది.. ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు సుమా
కూరగాయాల్లో రాజా వంకాయక. ఇది చాలా మందికి ఇష్టమైన కూరగాయ. కూరా, వేపుడు, పచ్చడి, బిర్యానీ ఇలా రకరకాలుగా చేసుకుని లోట్టలేసుకుని మరీ తింటారు. అయితే వంకాయలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని వ్యాధులతో బాధపడే వారు వంకాయని తినడం హానికరం. అవును.. మీరు చదివింది నిజమే! ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వంకాయ విషం లాంటిది.
Updated on: Sep 07, 2025 | 10:44 AM

కూరగాయల్లో రాజు వంకాయలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె, సి ఉన్నాయి. ఇందులో నియాసిన్, మెగ్నీషియం, రాగి కూడా తక్కువ మొత్తంలో ఉన్నాయి. వంకాయతో రకరకాల కూరలు చేస్తారు. వంకాయ పకోడీలు లేదా స్టఫ్డ్ వంకాయ, బైంగన్ రైస్ ఇలా ఎన్నో రకాల ఆహారపదర్దాలు తయారు చేస్తారు. వీటి గురించి ఆలోచిస్తేనే నోటిలో నీరు కారుతుంది. అయితే ఈ రుచికరమైన కూరగాయ కొంతమందికి విషం కంటే తక్కువేమీ కాదని మీకు తెలుసా?

ఆయుర్వేదంలో వంకాయ కఫ , పిత్తాన్ని పెంచుతుందని పేర్కొన్నది. అంటే కొన్ని వ్యాధులున్నవారికి సమస్యలకు కలిగిస్తుంది. మీరు కూడా వంకాయను చాలా ఇష్టపడితే.. ఖచ్చితంగా ఈ రోజు ఈ కథనాన్ని ఒకసారి చదవండి. ఎందుకంటే సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న సమస్యలు మీకు ఇష్టమైన వంకాయ వల్ల కావచ్చు.

కీళ్ళవాతం: కీళ్ల నొప్పులు ఉంటే వంకాయకు దూరంగా ఉండండి. వంకాయలో 'సోలనైన్' అనే ప్రత్యేక మూలకం ఉంటుంది. ఇది శరీరంలో మంటను పెంచుతుంది. ఇది కీళ్ల నొప్పులను మరింత పెంచుతుంది .

పైల్స్: పైల్స్ రోగులు వంకాయలు అస్సలు తినకూడదు. వంకాయకు వేడి స్వభావం ఉంటుంది. ఇది పైల్స్ సమస్యను పెంచుతుంది. ఇది దురద , మంటను కూడా పెంచుతుంది, ఇది సమస్యను మరింత పెంచుతుంది.

మూత్రపిండాల రాళ్ళు: ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ సమస్య ఉంటే తినే ఆహారం నుంచి వంకాయను తొలగించండి. వంకాయలో 'ఆక్సలేట్' అనే మూలకం ఉంటుంది. ఇది కాల్షియంతో కలిసి రాళ్ల పరిమాణాన్ని పెంచుతుంది. సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

అలెర్జీ: వంకాయ కొంతమందిలో అలెర్జీలకు కారణమవుతుంది. వంకాయ తిన్న తర్వాత చర్మంపై దురద, దద్దుర్లు లేదా ఎరుపు వంటి సమస్యలు కలుగుతుంటే.. మీకు వంకాయ అలెర్జీ ఉందని అర్థం. అటువంటి పరిస్థితిలో వెంటనే వంకాయని తినడం మానేయాలి.

గ్యాస్ట్రిక్ సమస్యలు: కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు తరచుగా ఉన్నవారు వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ బరువుగా ఉంటుంది. జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. ఇది ఉబ్బరం. గ్యాస్ సమస్యను పెంచుతుంది.




