చపాతీలు చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం డేంజర్‌ లో పడినట్లే!

చపాతీలు తయారు చేసిన తర్వాత అవి ఎక్కువ సమయం వేడిగా ఉండేందుకు హాట్‌కేస్‌లో పెడుతుంటారు. కొందరు అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ని ఉపయోగిస్తారు. వేడి వేడి రోటీలను పేపర్‌లో చుట్టడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దానికి బదులుగా కాల్చిన చపాతీలను ఒక శుభ్రమైన గుడ్డలో ఉంచడం మంచిది.

చపాతీలు చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం డేంజర్‌ లో పడినట్లే!
Roti
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 07, 2024 | 9:16 AM

చాలా మంది ఇళ్లలో చపాతీలే ఎక్కువగా తింటుంటారు. కొందరు రోజుకు మూడుపూటలు రోటీలను తింటే, మరికొందరు ఉదయం, రాత్రికి బోజనం, అల్ఫాహారంగా రొట్ట తినే అలవాటు ఉంటుంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు చపాతీలను తయారు చేస్తుంటారు. ఇది చాలా ఇళ్లలో జరుగుతుంది. అయితే, రోటీ చేసేటప్పుడు మనం తరచుగా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చపాతీలు చేసేందుకు ముందుగా పిండిని బాగా తడుపుకోవాలి. కానీ,పిండిని పిసికిన వెంటనే రోటీని తయారు చేయవద్దు. చాలా మంది పిండిని పిసికిన వెంటనే రోటీని తయారు చేస్తారు. అయితే ఇలా చేయకూడదు. పిండి తడిపిన తర్వాత దానిపై మూతపెట్టి కాసేపు అలాగే పక్కన పెట్టేయాలని చెబుతున్నారు.మన అమ్మలు, అమ్మమ్మలు ఎక్కువగా ఇలాగే చేసేవారు. ఇలా చేయటం వల్ల చపాతీలు, మెత్తగా,పూరీల పొంగి మృదువుగా వస్తాయి.

ఇక, తయారు చేసిన చపాతీని ఐరన్ పాన్‌పై మాత్రమే కాల్చాలి. దీనికోసం కొంతమంది నాన్ స్టిక్ పాన్ వాడుతుంటారు. కానీ,ఇది ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు నిపుణులు. మీరు కూడా ఇలా చేస్తే,వెంటనే ఈ అలవాటును మార్చుకోండి.

ఇవి కూడా చదవండి

ఇకపోతే,ఈ రోజుల్లో అందరూ మిల్లు పిండిని వాడటం మానేశారు.నేరుగా దొరికే ప్యాక్ చేసిన పిండిని తింటున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం. స్వయంగా గోధుమలు తెచ్చుకుని కడిగి ఆరబెట్టి, మరపట్టిన పిండిని వాడితే మంచి ఆరోగ్యం. దీంతో ఎలాంటి కల్తీ లేకుండా మీ చపాతీ పిండిని సిద్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో చపాతీల కోసం మల్టీగ్రేన్‌ ఆటను వినియోగిస్తున్నారు. ఇది మంచి ఆరోగ్యదాయకం. కేవలం గోధుమలు మాత్రమే కాకుండా ఎక్కువ ధాన్యాలను కలిపి మిల్లులో పట్టించిన పిండితో చపాతీలు చేసుకుని తినటం వల్ల మంచి పోషకాలు లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది.

చివరగా చాలా మంది చపాతీలు తయారు చేసిన తర్వాత అవి ఎక్కువ సమయం వేడిగా ఉండేందుకు హాట్‌కేస్‌లో పెడుతుంటారు. కొందరు అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ని ఉపయోగిస్తారు. వేడి వేడి రోటీలను పేపర్‌లో చుట్టడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దానికి బదులుగా కాల్చిన చపాతీలను ఒక శుభ్రమైన గుడ్డలో ఉంచడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!