AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health: చలికాలంలో ఈ పండును అస్సలు మిస్ కావొద్దు.. ఎందుకంటే..?

చలికాలంలో ఆరెంజ్ పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ఉన్న విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరెంజ్ తినడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు దూరమవడమే కాకుండా బరువు నియంత్రణలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. స్కిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. చలికాలంలో ఈ పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Winter Health: చలికాలంలో ఈ పండును అస్సలు మిస్ కావొద్దు.. ఎందుకంటే..?
Benefits Of Eating Oranges
Prashanthi V
|

Updated on: Jan 18, 2025 | 7:41 PM

Share

చలికాలం, వర్షాకాలంలో అంటువ్యాధులు, జలుబు, వైరల్ ఫీవర్ లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉండటం చాలా అవసరం. చలికాలంలో ఈ ఆరెంజ్ పండ్లను తింటే జలుబు వస్తుందని చాలా మంది అనుకుంటారు. చలికాలంలో ఆరెంజ్ తినడం మంచిదా..? కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి

చలికాలంలో ఆరెంజ్ పండ్లను తింటే ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా శరీర రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే చలికాలంలో ఆరెంజ్ పండ్లను తింటే జలుబు, దగ్గు వస్తాయని చాలా మంది అనుకుంటారు. ఆరెంజ్ తినడం వల్ల శరీరాన్ని జలుబు నుండి కాపాడుతుంది, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

బరువు నియంత్రణ

ఆరెంజ్ పండ్లను తినడం వల్ల బరువు పెరగడం అదుపులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగానూ, ఫైబర్ అధికంగానూ ఉంటుంది. అందువలన మీకు రోజంతా కడుపు ఫుల్ అయిన అనుభూతిని కలిగిస్తుంది.

జాయింట్ పెయిన్ రిలీఫ్

చలికాలంలో ఆరెంజ్ పండ్లను తినడం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఆరెంజ్ తో మీ స్కిన్ హెల్తీ

ఆరెంజ్ పండు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గుకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది స్కిన్ గ్లోను పెంచుతుంది, స్కిన్ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

తక్కువగా తినండి

నారింజను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు పెరుగుతాయి. కాబట్టి, దీన్ని రెగ్యులర్ గా లిమిటెడ్ గా మాత్రమే తీసుకోవాలి. తక్కువ పరిమాణంలో తినడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)