AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..? తెలిస్తే ఇప్పుడే మొదలుపెడతారు..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రజలు షుగర్, బరువు పెరగడం వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణం అన్నం అతిగా తినటం అనుకుంటున్నారు చాలా మంది. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు వైట్ రైస్‌కు బదులు మిల్లెట్స్ (చిరుధాన్యాలు) తినడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మార్కెట్లో రాగులు, జొన్నలు, సామలు, కొర్రలు, సజ్జలు, అరికెలు, ఊదలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ మిల్లెట్స్ తినడం వల్ల లభాలేంటో తెలుసుకుందాం.

వైట్ రైస్ కాకుండా మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..? తెలిస్తే ఇప్పుడే మొదలుపెడతారు..
Millets
Jyothi Gadda
|

Updated on: Aug 04, 2025 | 8:48 PM

Share

మిల్లెట్స్‌లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మిల్లెట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి తిన్నా కూడా రక్తంలో షుగర్ నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. దీంతో డయాబెటిస్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు. మిల్లెట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదల అడ్డుకుంటాయి. తద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు.

మిల్లెట్స్‌లో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు, గుండె నుంచి అవయనాలకు రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి. తద్వారా గుండె సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మిల్లెట్స్‌లో కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మిల్లెట్స్‌లో సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.

మిల్లెట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు మిల్లెట్స్‌ తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాలు శ్వాస ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు