బ్రోకలీని అతిగా తింటున్నారా.. అయితే జాగ్రత్త!.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట!
ఆరోగ్యానికి మేలు కలిగించే కూరగాయల్లో బ్రోకలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉండే అధిక పోషకాలు మన ఆరోగ్యానికి మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. అందుకే దిన్ని పోషకాల గని అనిపిస్తుంటారు. అయితే వీటిని ఎక్కవగా తినడం కూడా మంచిది కాదని నిపుణులు బెతున్నారు.. వీటిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావొచ్చిని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Updated on: Aug 04, 2025 | 7:23 PM

బ్రోకలీలో ఫైబర్ ఎక్కవగా ఉండడం వల్ల.. దీన్ని అధికంగా తీసుకుంటే ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. దీనిని మోతాదుకు మించి తీసుకున్నప్పుడు గ్యాస్టిక్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణశయాంతర (జీర్ణ) సమస్యలు ఉన్న మహిళలు కూడా బ్రోకలీ తినకూడదు. బ్రోకలీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం సమస్యలు ఏర్పడతాయి.

కొందరు గుండె జబ్బులు, ఇతర కారణాలతో రక్తం పల్చబడటానికి మందులు వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్లు వీటిని తినే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వీటిలో అధికంగా ఉండే విటమిన్ కె.. మీరు వాడే మందుల ప్రభావాన్ని తగ్గించి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచవచ్చు. కాబట్టి ఇలాంటి మందులు వాడే వారు దాన్ని తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.

బ్రోకలీ తినడం వల్ల చాలా అరుదుగా, కొంతమందికి అలెర్జీ సమస్యను ఎదుర్కొంటారు. వారు దీన్ని తిన్న తర్వాత శరీరంపై దద్దుర్లు, దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు వారు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

Broccoli




