బాదంపప్పుని మామూలుగా కన్నా నానబెట్టి ఎక్కువ తింటారు..! ఎందుకో తెలిస్తే మీరూ వదలరు..
Almonds: బాదంపప్పుని నానబెట్టకుండా తినడం వల్ల ఎలాంటి హాని ఉండదు. కానీ చాలామంది నానమ్మ, అమ్మమ్మల సలహాలను పాటించి నానబెట్టుకొని తింటారు. అయితే
Almonds: బాదంపప్పుని నానబెట్టకుండా తినడం వల్ల ఎలాంటి హాని ఉండదు. కానీ చాలామంది నానమ్మ, అమ్మమ్మల సలహాలను పాటించి నానబెట్టుకొని తింటారు. అయితే నానబెట్టిన బాదం నిజంగా మంచిదా? ఏదైనా అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందా.. మొదలైన విషయాలు తెలుసుకుందాం.
బాదం ప్రయోజనాలు బాదం పోషకాలతో నిండి ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, భాస్వరం ఇతర ఖనిజాలకు మూలం. ఈ పోషకాలన్నీ బరువు తగ్గడానికి, ఎముకల ఆరోగ్యానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతాయి. అధ్యయనాల ప్రకారం ప్రజలు అధిక మొత్తంలో వేరుశెనగ, వాల్‌నట్స్, బాదం తీసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. బాదం శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిని పెంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ముఖ్యంగా నానబెట్టిన బాదం తినడం వల్ల ఈ 4 ప్రయోజనాలు ఉంటాయి.
1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నానబెట్టిన బాదం సులభంగా జీర్ణమవుతుంది. నమలడం సులభం దీనివల్ల వృద్ధులకు, చిన్న పిల్లలకు సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు ఇందులో అనేక పోషకాలు ఉంటాయి.
2. అదనపు పోషణ బాదంపప్పును నానబెట్టడం వల్ల పోషకాల లభ్యత మెరుగుపడుతుంది. యాంటీఆక్సిడెంట్, ఫైబర్ అధిక మొత్తంలో శరీరానికి అందుతుంది.
3. బరువు తగ్గడం నానబెట్టిన బాదం లిపేస్ వంటి ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది ఇది జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల మీ భోజనం, స్నాక్స్‌లో బాదం తప్పనిసరిగా ఉండాలి.
4. ఫైటిక్ యాసిడ్‌ను తొలగిస్తుంది మనం బాదంపప్పును నానబెట్టకుంటే వాటిలో ఫైటిక్ యాసిడ్ విడుదల అవుతుంది ఇది పోషకాలను గ్రహించడాన్ని అడ్డుకుంటుంది. ముడి బాదం తినడం వల్ల అందులో ఉండే జింక్, ఐరన్ శరీరానికి సరిగ్గా అందవు.