Vizag: వేగంగా దూసుకొచ్చిన కారు… అనుమానం వచ్చి చెక్ చేసిన పోలీసులు.. షాక్

విశాఖలో గంజాయి అక్రమ రవాణా కలకలంరేపుతోంది. ఎంకె పట్నం శివారులో ఎస్‌ఈబీ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

Vizag: వేగంగా దూసుకొచ్చిన కారు... అనుమానం వచ్చి చెక్ చేసిన పోలీసులు.. షాక్
Ganja Smuggling
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 17, 2021 | 7:57 PM

విశాఖలో గంజాయి అక్రమ రవాణా కలకలంరేపుతోంది. ఎంకె పట్నం శివారులో ఎస్‌ఈబీ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారు స్పీడ్‌గా వెళ్తూ ఉండటంతో.. అనుమానం వచ్చి ఆపి డోర్ తీసి చెక్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయితో పాటు, ద్రవరూపంలో కూడా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగుర్ని అరెస్ట్ చేశారు.. ఓ కారు, బైక్ సీజ్ చేశారు. అక్రమార్కులు ఈ నలుగురితో గంజాయి రవాణా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు వీరికి ఒక్కొక్కరికీ 1200 రూపాయలతో పాటు కారు, రెండు బైక్‌లకు పదివేల రూపాయలు కిరాయి చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది. వీరికి కిరాయి అప్పగించిన వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణా పెరిగింది. దీంతో పోలీసులు, SEB అధికారులు నిఘా పెంచారు. సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. కంచుగుమ్మల కూడలి దగ్గర పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొబైల్స్, ఆయుధాలను సీజ్ చేశారు. కాగా గంజాయి స్మగ్లింగ్ చేసే మెయిన్ వ్యక్తులు దొరకడం లేదు. మధ్యలో డబ్బులకు ఆశపడి రవాణా చేసే వ్యక్తులను అసలైన స్మగ్లర్స్ పావులుగా వాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో దాడుల్లో దొరకుతోన్న గంజాయి చూస్తుంటే.. యువత ఏ రేంజ్‌లో మత్తుకు అలవాటుపడ్డారో అర్థమవుతోంది.

Also Read: ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ

కరీంనగర్ జిల్లాలో అరుదైన దృశ్యం.. లోయర మానేరు జలాశయంలో టోర్నడో

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో