Chicken: ప్రతి రోజూ చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా.. తెలుసుకోకపోతే అసలుకే మోసం..
చికెన్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు దీనిని ఇష్టంగా తింటారు. చికెట్ ప్రోటీన్ ఫుడ్ అంటూ ఎక్కువగా తింటుంటారు. అతిగా తింటే అమృతం కూడా విషమే. చికెన్ మితంగా తినే వారికి మంచిదే అయినా రోజూ అధికంగా తింటే ఆరోగ్యానికి హానికరం. చికెన్ ఎక్కువగా తింటే శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రోటీన్ యొక్క అద్భుత మూలమైన చికెన్.. ఫిట్‌నెస్ ఔత్సాహికుల ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే చికెన్‌ను క్రమం తప్పకుండా అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు, చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ కారణంగా ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని ఒహియో స్టేట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
సంతృప్త కొవ్వు సమస్య
చికెన్‌ను సాధారణంగా సంతృప్త కొవ్వు తక్కువగా ఉన్న ఆహారంగా పరిగణించినప్పటికీ.. ఇందులో కూడా కొంత మొత్తంలో కొవ్వు ఉంటుంది. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. చికెన్‌ను క్రమం తప్పకుండా తినడం ఆరోగ్యానికి హానికరం. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే నుండి 19 ఏళ్లు పైబడిన 36,378 మంది వ్యక్తుల డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం.. రోజువారీ కేలరీలలో సంతృప్త కొవ్వు కనీసం 12 శాతం ఉంటుందని.. చక్కెర 14 శాతం నుండి 16 శాతం వరకు ఉంటుందని తేలింది. ఈ అధిక సంతృప్త కొవ్వు, చక్కెర స్థాయిలే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
కొవ్వు, చక్కెర పెంచే ఇతర ఆహారాలు
చికెన్‌తో పాటు మనం తీసుకునే అనేక ఇతర ఆహారాలు కూడా సంతృప్త కొవ్వును పెంచుతాయి. జున్ను, పిజ్జా, ఐస్ క్రీం, గుడ్లు శరీరానికి సంతృప్త కొవ్వును ప్రధానంగా అందించే ఆహారాలుగా అధ్యయనంలో గుర్తించారు. క్రీమ్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే కోల్డ్ కట్స్, బంగాళాదుంప చిప్స్, పాలు కూడా సంతృప్త కొవ్వులో అధికంగా ఉంటాయి. అదనంగా కూల్ డ్రింక్స్, టీ, పండ్ల పానీయాలు, కేకులు, ఎనర్జీ డ్రింక్స్, ఈస్ట్ బ్రెడ్‌లు శరీరంలో కేలరీలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చికెన్, ఇతర సంతృప్త కొవ్వు ఉన్న ఆహారాలను క్రమం తప్పకుండా కాకుండా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా కేలరీలు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




