తేనె మంచిదని మరీ ఎక్కువగా తినేస్తున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
దీంతో కడుపు నొప్పి, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు రావొచ్చు. తేనెలో ఉన్న అధిక ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో నుంచి విషాన్ని తొలగించే పనిని కాలేయం చేస్తుంది. కానీ ఎక్కువ తేనె తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది కాలేయానికి నష్టం కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది.

తేనె ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కవగా తీసుకుంటారు. కానీ, ఎదైనా సరే అతిగా తీసుకుంటే అనర్థాలకు దారి తీస్తుందన్నట్టుగా తేనె కూడా మరీ ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తేనెలో చక్కెరతో పాటు కార్పొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి, అధికంగా వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. తేనె రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే గొప్ప పదార్ధంగా పరిగణించబడుతుంది. కానీ ఎక్కువ తేనె తినడం వల్ల తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
తేనె అధికంగా తీసుకుంటే…కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అస్కారం ఉంటుంది. తేనెలో ఉండే అధిక కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి దారితీస్తాయి. కాబట్టి మోతాదులో వాడటం మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. తేనె ఎక్కువగా వాడితే కొన్నిసార్లు దంత సమస్యలు దారి తీయవచ్చు. దంత క్షయం వంటి సమస్యలు రావొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
తేనె అధికంగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో కడుపు నొప్పి, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలు రావొచ్చు. తేనెలో ఉన్న అధిక ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో నుంచి విషాన్ని తొలగించే పనిని కాలేయం చేస్తుంది. కానీ ఎక్కువ తేనె తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది కాలేయానికి నష్టం కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








