AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్మాత్‌ జాగ్రత్త..! రాగి జావతో లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయండోయ్…

రాగుల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రాగి జావ‌ను ఇలా రాగి మొల‌క‌ల‌తో త‌యారు చేసి తాగితే ఇంకా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది. శ‌రీరానికి ఇంకా ఎక్కువ పోష‌కాలు ల‌భిస్తాయి. రాగుల‌తో జావ‌ను త‌యారు చేసి తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎన్నో ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. అయితే, రాగులతో లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే...

తస్మాత్‌ జాగ్రత్త..! రాగి జావతో లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయండోయ్...
Ragi Java
Jyothi Gadda
|

Updated on: May 29, 2025 | 1:37 PM

Share

ప్రతి రోజూ రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి పోషకాలను కలిగి ఉంటుంది. రాగులు అనేవి పోషకమైన ఆహారం. కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉన్న మిల్లెట్ ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రాగుల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవాంఛిత ఆహార కోరికలను అరికడుతుంది. ఆరోగ్యకరమైన బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే, రాగులతో లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే…

ముఖ్యంగా రాగి జావను ఉదయం తీసుకుంటే చాలా మంచిది. రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. బరువు పెరగాలనుకునేవారు రాగులు లేదా రాగి జావను ఎక్కువగా తీసుకోవద్దు. కొంచెంగా తీసుకోవచ్చు. ఎందుకంటే రాగజావ వినియోగంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. రాగి జావ అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వచ్చే అవకాశముంది. ఇది అందరిలో ఉండకపోవచ్చు.

మూత్రపిండాల్లో రాళ్లు లేదా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు రాగిజావకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆహార సున్నితత్వం ఉన్న పిల్లలకు రాగులతో కూడిన ఆహారం పెట్టకపోవటం మంచిది. ఈ విషయంలో వైద్యుడి సలహాలు తీసుకోవటం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!