మంచిదని తెగ తాగుతున్నారా..? అయితే, మీరు డయాబెటిస్‌ను డైరెక్ట్‌గా కొని తెచ్చుకున్నట్లే..
భారతదేశంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. డయాబెటిస్ ఉన్నవారు స్వీట్లు తినకుండా ఉండాలి. ఇటీవల పండ్ల రసం తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందా..? అనే దానిపై జరిగిన ఒక పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.. సోడా, ఎనర్జీ డ్రింక్స్ మిమ్మల్ని డయాబెటిస్ బాధితుడిగా మారుస్తాయని.. ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనం పేర్కొంది.

భారతదేశంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. డయాబెటిస్ ఉన్నవారు స్వీట్లు తినకుండా ఉండాలి. ఇటీవల పండ్ల రసం తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందా..? అనే దానిపై జరిగిన ఒక పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.. సోడా, ఎనర్జీ డ్రింక్స్ మిమ్మల్ని డయాబెటిస్ బాధితుడిగా మారుస్తాయని.. ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనం పేర్కొంది. పండ్ల రసం తాగడం వల్ల కూడా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిశోధనను బ్రిఘం యంగ్ విశ్వవిద్యాలయం (BYU) పరిశోధకులు చేశారు. ఇందులో, వివిధ ఖండాల నుండి 5 లక్షలకు పైగా ప్రజల డేటాను విశ్లేషించారు. ప్రతిరోజూ 350 మి.లీ సోడా లేదా ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 25% పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అదే సమయంలో, ప్రతిరోజూ 250 మి.లీ పండ్ల రసం తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం 5 శాతం పెరుగుతుంది.
పండ్ల రసం శరీరంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుందని పరిశోధనలో తేలింది. ప్రతిరోజూ వీటిని తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పరిశోధనలో నిర్దిష్ట పండు పేరును ప్రస్తావించలేదు.. కానీ ప్రతిరోజూ 250 మి.లీ. ఏదైనా రకమైన పండ్ల రసం తీసుకోవడం వల్ల మీకు డయాబెటిస్ వస్తుందని దానిలో వివరించారు.. ఏదైనా రకమైన పండ్ల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు వివరించారు.
జ్యూస్ కంటే.. నేరుగా తినడమే మంచిదంటా..
పండ్ల రసం కంటే మొత్తం పండ్లు తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. ఇది మధుమేహ ప్రమాదాన్ని పెంచదు. పండ్లు, తృణధాన్యాలు లేదా పాల ఉత్పత్తులలో ఉండే చక్కెర ప్రమాదకరం కాదు. అదేవిధంగా, ఫైబర్, ప్రోటీన్, ఇతర పోషకాలు కూడా చక్కెర స్థాయిని పెంచవు. జామున్, కాకరకాయ, ఆకుపచ్చ కూరగాయలు డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ జ్యూస్‌లు, ఏ రకమైన ఎనర్జీ డ్రింక్స్ అయినా మిమ్మల్ని సులభంగా డయాబెటిస్ బాధితుడిని చేస్తాయని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, వాటిని తిసుకోకుండా ఉండటమే బెటర్.. అని సూచిస్తున్నారు.
భవిష్యత్తులో పండ్ల రసాలు, సోడా పానీయాల వల్ల మధుమేహం ఉన్నవారికి మరింత ప్రమాదం.. లేనివారికి మధుమేహం వచ్చే ప్రమాదం పొంచి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, డయాబెటిస్ లేనివారు ఒక రోజులో ఎంత పండ్ల రసాలైనా తాగవచ్చని అనుకోకూడదు.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి
రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయండి
మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి.. ఆరోగ్యకరమైన వాటిని తినండి..
తీపి పదార్థాలు తక్కువగా తినండి
మానసిక ఒత్తిడికి గురికావద్దు
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




