ఇది తంగేడు కాదండోయ్.. ఆరోగ్యానికి ఔషధ నిధి చెన్నంగి.. తింటే చెప్పలేనన్నీ లాభాలు..
వర్షంకాలం అంటేనే సీజనల్ వ్యాధుల భయం పట్టుకుంటుంది. వానలతో పాటుగానే ఈ సీజన్‌లో దోమలు, జ్వరాలు, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తరచూ వెంటాడుతుంటాయి. అయితే, ఇలాంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేందుకు మన ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధ మూలికా మొక్కలు అనేకం ఉన్నాయి. అందులో చెన్నంగి ఒకటి. దీనినే కసివింద అని అంటారు. ఈ మొక్కలోని ప్రతి భాగంగా ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుంని ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చెన్నంగి చెట్టు లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
Updated on: May 28, 2025 | 9:34 AM

చెన్నంగి.. దీన్నే కసివింద అని కూడా అంటారు..చెన్నంగి ఆకులతో పచ్చడి చేసుకుని తింటే..నోటికి రుచిస్తుంది. జ్వరంతో నోటి రుచి కోల్పోయిన వారికి ఈ చట్నీ తిరిగి రుచి తెలిసేలా చేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలను కలిగిన చెన్నంగిలో చిన్న కసివింద, పెద్ద కసివింద అని రెండు రకాల చెట్లు ఉంటాయి. దీనిని చిన్న చెన్నంగి, పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు..

చిన్న చెన్నంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కసివింద చెట్టు రసం చేదుగా ఉండి వేడిని కలిగిస్తుంది. దీనిలోని గుణాలు వాతాన్ని, విషాన్ని హరించే శక్తి ఈ కసివింద చెట్టుకు ఉంది. గాయాలను, వ్రణాలను, చర్మ రోగాలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.

కసివింద చెట్టు ఆకులను వెన్నతో నూరి చచ్చుబడిన పక్షవాత భాగాలపైన ప్రతిరోజూ మర్దనా చేయడం వల్ల అవి పూర్వ స్థితికి చేరుకుంటాయి. కసివింద ఆకులను, వేరు బెరడును ఎండబెట్టి పొడిలా చేసుకుని తేనెను కలిపి లేపనంగా రాసుకోవడం వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు, గాయాలు, వ్రణాలు తగ్గుతాయి.

ఈ మొక్క పువ్వులను దంచి వస్త్రంలో వేసి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల పరిమాణంలో కంటిలో వేసుకుంటూ ఉంటే ఏడు రోజులల్లో రేచీకటి తగ్గుతుంది. కసివింద గింజలను దోరగా వేయించి పొడి చేసుకుని తగినన్ని పాలు, కండచక్కెర కలిపి కాఫీ లా తాగుతూ మూత్ర సంబంధిత రోగాలు తగ్గుతాయి. రక్తం కూడా శుద్ధి అవుతుంది.

శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు ఆగకుండా రక్తం కారుతూ ఉంటే, ఈ చెట్టు ఆకులను దంచి కట్టుగా కట్టడం వల్ల గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది. ఇలా కసివింద చెట్టుతో మనం బోలెడు ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా ఇంటికి తెచ్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.




