AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trying to weight Lose: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు..

బరువు తగ్గడానికి డైట్ ను ఫాలో అవుతున్నవారు కూడా ఆకలివేస్తే దానిని నియంత్రించడం కష్టం..ఆకలి వేస్తుంది ఏమైనా తినాలి అనే ఫీలింగ్ కలిగితే.. వెంటనే ఆహారం వైపు దృష్టి మరలుతుంది. సమీపంలో తినడానికి ఏమైనా దొరుకుతాయా అని వెదుకుతాం..

Trying to weight Lose: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా?  తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు..
Surya Kala
|

Updated on: Mar 01, 2021 | 1:24 PM

Share

Trying to weight Lose : బరువు తగ్గడానికి డైట్ ను ఫాలో అవుతున్నవారు కూడా ఆకలివేస్తే దానిని నియంత్రించడం కష్టం..ఆకలి వేస్తుంది ఏమైనా తినాలి అనే ఫీలింగ్ కలిగితే.. వెంటనే ఆహారం వైపు దృష్టి మరలుతుంది. సమీపంలో తినడానికి ఏమైనా దొరుకుతాయా అని వెదుకుతాం.. ఇక దగ్గర్లో కనిపించిన చాక్లెట్లు, ఐస్ క్రీం, పిజ్జా , ఫ్రై ఇలా ఏది కనిపిస్తే దానిని వెంటనే తినాలని కోరుకుంటారు.

వాస్తవానికి మీరు తినే తిండి విషయంలో కంట్రోల్ పాటిస్తూ.. బరువు తగ్గాలని కోరుకుంటున్నవారు అయితే అటువంటి సమయం మీకు పెద్ద అవరోధం కలిగిస్తుంది. ఎందుకంటే మీరు ఆకలి తీర్చుకోవడానికి తినే ఆహారంలో ఎక్కువగా చక్కెర, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పదార్ధాలు కలిగి ఉంటాయి. అవి మీరు బరువు తగ్గాలని ఆలోచనలు అతిపెద్ద అవరోధాలు.. ఇక అధికంగా ఉండే క్యాలరీలు మరింత పెరగడానికి కారణం కావచ్చునని కాస్మిక్ న్యూట్రాకోస్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ డాలీ కుమార్ చెప్పారు.

అందుకని, కేలరీలు అధికంగా ఉండే ఆహార నియంత్రకు ఐదు మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మనం తినే దానిపై మంచి అవగాహన ఉంటె భోజనము ప్లాన్ చేయడం పెద్ద కష్టతరమైన విషయం కాదు. నిజానికి మన పెద్దలు ఉదయం రాజుగా అల్పాహారం, యువరాజుగా భోజనం .. సాయంత్రం బిచ్చగాడు విందు తినాలని సామెతను ఎప్పుడో చెప్పారు.

అల్పాహారం

అల్పాహారం నిజంగా రోజుకు అత్యంత ముఖ్యమైన భోజనం. ఈ అల్పాహారంగా తీసుకునే పోషకమైన ఆహారం మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుందని కుమార్ చెప్పారు. అయితే ఈ అల్పహారాన్ని ఎక్కువుగా తీసుకోకూడదు. అంతేకాదు నూనె పదార్ధాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. హెవీగా టిఫ్న్ తినే పని చేసేటప్పుడు బద్ధకం వస్తుందని చెప్పారు. ఇక ఇంట్లో వండిన ఆహారాన్ని చపాతీ, కొన్ని రకాలైన పచ్చి కూరగాయలను అల్పాహారంగా ఎంచుకోవచ్చు. ఇంకా తాజాగా వెజ్ సలాడ్ ను టిఫిన్ గా తీసుకోవడం మంచిదని తెలిపారు.

భోజనం

మధ్యాహ్నం తీసుకునే విందు- సర్వసాధారణంగా మధ్యాహ్నం రకరకాల ఐటెమ్స్ తో ఎక్కువ ఆహారం తిండడానికి ఇష్టపడతారు. అయితే ఈ మీ భోజనంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్ల ఆరోగ్యకరమైన సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంలో తృణధాన్యాలు, క్వినోవా లేదా చిక్కుళ్ళు వంటి ఫైబర్‌ను మీరు కలిగి ఉండే పదార్ధాలను ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫుడ్ ఎక్కువ సేపు ఆకలిని నియంత్రిస్తుంది.. త్వరగా జీర్ణమవుతుంది. గుడ్డులోని తెల్లసొన లేదా సోయా ల్లో ఎక్కువ మోతాదు ప్రోటీన్ల కలిగి ఉంటాయి. కనుక మీరు తినే ఆహారంలో రోజువారీ పదార్ధాలుగా వాటిని చేర్చవచ్చు.

ఆరోగ్యకరమైన అల్పాహారం

రుచికరమైన సమోసా.. టీ కాంబినేషన్ ను ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి.. అయితే ఈ అలవాటు హానికరం అని మనందరికీ తెలుసు. మీరు కేలరీలను తగ్గించాలనుకుంటే, సాయంత్రం తినే ఆహారం విషయంలో కోరికలను నియంత్రించాల్సిందే. ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్నాక్స్ గా ఎంచుకోవాల్సిందే.. మొలకెత్తిన గింజలు, పండ్ల మిశ్రమాలు, ఉడికించిన మొక్కజొన్న , పండ్లు, వంటివి సాయంత్రం అల్పాహారంగా తీసుకుంటే ఆహారం తినాలనే కోరికలను అరికట్టగలవని కుమార్ సూచిస్తున్నారు.

చక్కెరను స్టెవియాతో భర్తీ చేయండి

తీపి దంతాలు ఉన్నవారికి చక్కెర తినాలి అనే కోరిక సర్వసాధారణం. అయితే తీపి పదార్ధాలను తినడం తగ్గించుకోవడం లేదా దాని ప్లేస్ లో వేరే ఆహారపదర్శలను తినడం చేస్తే బరువు తగ్గించుకోవడం సులభం. అంతేకాదు దీర్ఘకాలంలో డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. అందుకని చక్కెర అవసరమయ్యే అన్ని ఆహారాపదార్ధాలకు బదులుగా క్యాలరీ లేని స్వీటెనర్ వాడండని కుమార్ సూచిస్తున్నారు.

జీవనశైలిలో మార్పులు

ముఖ్యంగా బరువు అదుపులో ఉండదని లేదా తగ్గించుకోవడానికి మనం తినే ఆహారంకంటే ఎక్కువుగా నీరుత్రాగటం వంటి కొన్ని ప్రాథమిక మార్పులు మీ ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపగలవు.

కొన్ని సార్లు ఆహారం తినాలి అనే కోరిక మానసికంగా ఉంటుంది. అటువంటి సమయంలో పెద్ద గ్లాస్ నీరు తాగితే ఆహారం తినాలి అనే భావన నుంచి దృష్టి మారుతుంది’ అని కుమార్ చెప్పారు. ఇక రోజూ సరైన సమయంలో.. సరిపడేటంత నిద్ర లేకపోతె దాని ప్రభావం ఆహారంపై కోరికను కలిగిస్తుందని ఆమె వివరించారు. కనుక ‘మీ నిద్రను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు మరియు రోజువారీ ధ్యానం .. సమయానికి భోజనం తినడం వంటి దినచర్యను ఎల్లప్పుడూ పాటించాలని సూచించారు.

Also Read:

ఆసక్తికరంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, థర్డ్‌ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేసిన శరత్‌కుమార్‌

వయసేమో ఐదేళ్లు.. ఏకంగా ప్రపంచ రికార్డు సాధించింది.. అందరిచేత హ్యాట్సాప్ అనిపించుకుంది..