AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Cream: ఫ్రూట్స్ తినాలంటే బోర్ కొడుతోందా.. అయితే, ఇలా ట్రై చేయండి..

పండ్లను తినడం బోర్ కొడితే సులువుగా ఫ్రూట్ క్రీమ్ తయారు చేసుకుని తినొచ్చు. పిల్లలకు పండ్లు తినిపించడానికి ఇది ఎంతో ఉత్తమ మార్గం. కోల్డ్ ఫ్రూట్ క్రీమ్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది.

Fruit Cream: ఫ్రూట్స్ తినాలంటే బోర్ కొడుతోందా.. అయితే, ఇలా ట్రై చేయండి..
Fruit Cream
Venkata Chari
|

Updated on: Apr 12, 2022 | 1:34 PM

Share

ఎండాకాలం వచ్చిందంటే చాలు కాస్త చల్లగా తినాలనిపిస్తుంది. దీంతో పలు రకాల వంటకాలను తయారుచేస్తుంటారు. అయితే, అతిథులు ఇంటికి వచ్చి లంచ్ లేదా డిన్నర్‌లో చల్లని తీపి వంటకాన్ని అందించాలనుకుంటే, మీరు ఫ్రూట్ క్రీమ్ ట్రై చేయవచ్చు. ఇది ఆరోగ్యకరమైనది, ఎంతో రుచికరమైనది. పండ్లను తినడం బోర్ కొడితే సులువుగా ఫ్రూట్ క్రీమ్ తయారు చేసుకుని తినొచ్చు. పిల్లలకు పండ్లు తినిపించడానికి ఇది ఎంతో ఉత్తమ మార్గం. కోల్డ్ ఫ్రూట్ క్రీమ్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మీరు ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్ కోసం ఫ్రూట్ క్రీమ్ సిద్ధం చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఫ్రూట్ క్రీమ్ కోసం ఏ పండ్లు అవసరం, ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఫ్రూట్ క్రీమ్ తయారీకి కావలసిన పదార్థాలు..

400 గ్రా. క్రీమ్

70 గ్రాముల పొడి చక్కెర

1 ఆపిల్

1 పండిన తీపి మామిడి

1 దానిమ్మ గింజలు

20 పండిన ద్రాక్ష

6-7 జీడిపప్పులు

6-7 బాదంపప్పులు

2 టేబుల్ స్పూన్లు ఎండుద్రాక్ష

ఫ్రూట్ క్రీమ్ తయారీ..

ఫ్రూట్ క్రీమ్ చేయడానికి, ముందుగా క్రీమ్‌ను విప్ మెషిన్‌తో కొద్దిగా తక్కువ వేగంతో చిలక్కొట్టాలి. క్రీమ్ కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఇలా చేయాలి. అందులో పంచదార పొడి వేసి బాగా కలపాలి. అనంతరం అన్ని పండ్లను వేసి బాగా కడగాలి. ఆ తర్వాత యాపిల్, మామిడికాయలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అరటిపండు తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. ద్రాక్షను కూడా రెండు ముక్కలుగా కోసుకోవాలి. దానిమ్మపండు తొక్క తీసి, గింజలను తీసి, జీడిపప్పు-బాదంపప్పులను చిన్న ముక్కలుగా కోయాలి. ఎండుద్రాక్షను శుభ్రం చేసి, నీటితో కడగాలి.

ఇప్పుడు కోసిన పండ్లను స్వీట్ క్రీమ్‌లో కలపండి. అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి, ఒక చెంచా సహాయంతో క్రీమ్‌ను బాగా కలపాలి. దీంట్లో దానిమ్మ గింజలను కలిపి, ఫ్రూట్ క్రీమ్‌ను అలంకరించడానికి కొన్ని దానిమ్మ గింజలను వేసుకోవాలి. ఇలా సిద్ధం చేసిన ఫ్రూట్ క్రీమ్‌ను ఒక పాత్రతో కప్పి, 2 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచండి. ఆ తరువాత, ఒక గిన్నెలో కోల్డ్-కోల్డ్ ఫ్రూట్ క్రీమ్ సర్వ్ చేస్తే సరి.

Also Read: Beauty Tips: ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోయారా.. పెరుగుతో ఇలా ఉపశమనం పొందండి..!

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి 5 శాఖాహార ఆహారాలు.. ప్రతిరోజు తినాల్సిందే..!