Fact Check: ఈ కషాయం తాగితే కరోనా పోతుందా.? నెట్టింట వైరల్.. ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే.!

కరోనా రెండో దశ రూపంలో మరోసారి దేశంలోని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. కోవిడ్ కట్టడి కోసం.. రాష్ట్రాలు లాక్ డౌన్ విధించగా.. చాలా మంది

Fact Check: ఈ కషాయం తాగితే కరోనా పోతుందా.? నెట్టింట వైరల్.. ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే.!
Kadha Recipe
Follow us

|

Updated on: Jun 03, 2021 | 9:06 PM

కరోనా రెండో దశ రూపంలో మరోసారి దేశంలోని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. కోవిడ్ కట్టడి కోసం.. రాష్ట్రాలు లాక్ డౌన్ విధించగా.. చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే కరోనా నుంచి తమను తాము రక్షించుకునేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆహారంపై శ్రద్ధ వహిస్తున్నారు. జంక్ ఫుడ్ కు బదులుగా సహజ వనరులను తీసుకుంటున్నారు. ఇక అదే సమయంలో చాలా మంది రకారకాల కషాయాలను తాగేస్తున్నారు. లవంగాలు, మిరియాలు వంటి మసాలా దినుసులతో కషాయాలు రెడీ చేసుకోని తాగేస్తున్నారు.

అయితే ఇదిలా ఉంటే.. ఇటీవల వాట్సాప్ లో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ కషాయం తాగితే కరోనా వైరస్ రాదని ప్రచారం జరుగుతుంది. ఆ వీడియోలో ఏముందంటే.. యాలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, కారం విత్తనాలు, పసుపు, లవంగాలతో కలిపి ఓ కషాయాన్ని రెడీ చేశారు.. ఆ వీడియో డాక్టర్ అంటూ చెప్పే ఓ వ్యక్తి ఈ కషాయాన్ని తాగితే 24 గంటలలో కరోనా వైరస్.. దాని లక్షణాలు నిర్మూలించవచ్చని పేర్కోన్నారు. అయితే ఈ వీడియోపై ప్రభుత్వ సంస్థ పీఐబీ లోతైన దర్యాప్తు నిర్వహించి నిజాన్ని వెల్లడించింది.

ట్వీట్..

వాట్సాప్ లో షేర్ అవుతున్న ఈ వార్త వైరల్ అని పీఐబీ పేర్కోంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఆ వీడియోను తప్పుదోవ పట్టించే విధంగా షేర్ చేయకూడదని తెలిపింది. అందులో ఉపయోగించిన పెద్ద యాలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, లవంగాలు, పసుపు కలిపిన కషాయం తీసుకోవడం వలన కేవలం రోగ నిరోధక శక్తి మాత్రమే పెరుగుతుందని పీఐబీ తెలిపింది. దీంతో కరోనా వైరస్ ను నిర్మూలించలేమని తెలిపింది. అలాగే ఇలాంటి ఆయుర్వేద లేదా ఇంటి చిట్కాలను ఉపయోగించే ముందు డాక్టర్ల సలహా తీసుకోవాలని తెలిపింది.

Also Read: Ariyana: “ఆ ఒక్క ఇంటర్వ్యూ నా లైఫ్ జీవితాన్నే మార్చేసింది” .. ఆర్జీవి పై అరియానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..