Health Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే.. విటమిన్ కె ఫుడ్స్ ఎంతో బెటర్..
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ కె కూడా అవసరం. ఈ సహజ వనరులను ఉపయోగించడం ద్వారా మీరు విటమిన్ కె లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు.
Vitamin K: విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ కె ఉంటుంది. విటమిన్ కె మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. గుండె, ఊపిరితిత్తుల కండరాలను బలంగా ఉంచేందుకు విటమిన్ K అవసరం. విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆహారాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. విటమిన్ కె ఏయే ఆహారాలలో లభిస్తుందో తెలుసుకుందాం.
విటమిన్ K సహజ వనరులు..
- ఆకుపచ్చ ఆకు కూరల నుంచి విటమిన్ K పొందుతారు. ఆకుకూరలు, బచ్చలికూర, క్యాబేజీ, బ్రోకలీ, బీన్స్, మెంతులు, ఇతర ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవచ్చు.
- పాల ఉత్పత్తులు- విటమిన్ K సమృద్ధిగా ఉన్న ఆహారాలలో పాల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. దీని కోసం మీరు పాలు, పెరుగు, చీజ్, వెన్న వంటి వాటిని తీసుకోవచ్చు.
- పండ్లు- పండ్లలో విటమిన్లు ఎక్కువగా కనిపిస్తాయి. విటమిన్ కె లోపాన్ని తీర్చుకోవడానికి దానిమ్మ, ఆపిల్, బీట్‌రూట్ తినవచ్చు.
- చేపలు, గుడ్డు- గుడ్డు, చేప శరీరానికి అనేక విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ కె లోపం కూడా తీరుతుంది. విటమిన్ కె చేపలు, పంది మాంసం, గుడ్లలో కూడా లభిస్తుంది.
- దుంప- దుంపలలో కూడా విటమిన్ K లభిస్తుంది. విటమిన్ ఎ కూడా దుంపల్లో లభిస్తుంది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సమాచారం కోసమే అందించా. వీటిని సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం తీసుకునే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.