స్వీట్లు తినే అలవాటును మానలేకపోతున్నారా.? అయితే ఈ 3 పద్దతులు ఫాలో అవ్వండి..

”ఆరోగ్యమే మహాభాగ్యం” అని అంటుంటారు. ఆరోగ్యంగా ఉంటేనే సకల ఐశ్వర్యాలు, అదృష్టం కలిసొస్తుంది. ఇక ఇలా ఉండాలంటే.. మనతో పాటు..

స్వీట్లు తినే అలవాటును మానలేకపోతున్నారా.? అయితే ఈ 3 పద్దతులు ఫాలో అవ్వండి..
Sweets
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 10, 2021 | 6:52 AM

”ఆరోగ్యమే మహాభాగ్యం” అని అంటారు. దానిని జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్లను మించిన ఐశ్వవంతులు ఉండరనడం అతిశయోక్తి కాదు. అయితే ఒక్కోసారి మనం తినే ఆహార పదార్ధాలే మనకు హాని చేస్తాయి. ఏదైనా అతిగా తింటే అనర్ధమే కదండీ… కొందరు స్వీట్లు బాగా ఇష్టంగా, ఎక్కువగా తింటారు. ఒక విధంగా చెప్పాలంటే వాటికి బానిసైపోతారు. ఆ అలవాటును మార్చుకోలేక ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్లకోసం కొన్ని చిట్కాలు చూద్దాం…

చాలామందికి స్వీట్స్‌ అంటే మహా ఇష్టం. ప్రతీ రోజూ కనీసం ఒక్కసారైనా స్వీట్ తినకుండా ఉండలేరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎంత ఎక్కువగా చక్కెర తింటే.. అంత ఎక్కువగా తీపి తినాలని కోరిక పెరుగుతుందట. ఏదైనా కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. షుగర్ కూడా అంతే. చక్కెర మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం మాత్రమే కాదు.. అనేక ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి 10 రోజుల్లో స్వీట్స్ తినడం తగ్గించుకోండి. అవేంటంటే..

పిండి, ప్యాకేజ్డ్ ఆహారాలకు దూరంగా ఉండండి..

పిండి, కృత్రిమ స్వీట్‌నర్, హైడ్రోజనేటెడ్ కొవ్వులు, ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. చక్కెర లేకుండా టీ, కాఫీ తాగండి. పచ్చి కూరగాయల జ్యూస్‌లు తప్పితే ఇంకేవి తీసుకోవద్దు. అతి ముఖ్యంగా మార్కెట్‌లో లభించే పానీయాలను అస్సలు తాగకూడదు.

ఆహారంలో ప్రోటీన్ శాతం పెంచండి…

అల్పాహారం, లంచ్, డిన్నర్‌లో ప్రోటీన్ శాతం పెరగాలి. ఆహారంలో గుడ్లు, గింజలు, విత్తనాలు, చేపలు, చికెన్, మాంసం, సోయా పాలు, వోట్ మీల్‌ను చేర్చండి. ప్రోటీన్ అధికంగా ఉండే ఈ ఆహారంతో శరీరం కావల్సినంత శక్తిని పొందుతుంది. తోటకూర, ఆకుపచ్చ బీన్స్, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, గుమ్మడికాయ, టమోటాలు, సోపు, వంకాయ, క్యాప్సికమ్ వంటి పిండి పదార్ధాలకు దూరంగా ఉండండి. గ్లూటెన్, పాల ఉత్పత్తులను తగ్గించండి.

ఒత్తిడికి అస్సలు గురికావద్దు…

మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీ కార్టిసాల్ హార్మోన్‌లో మార్పులు జరుగుతాయి. అలాగే ఆకలి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో స్వీట్స్ ఇష్టపడేవారు.. చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలపై దృష్టి సారిస్తారు. అందుకే అస్సలు ఒత్తిడికి గురికాకూడదు. అలాగే చక్కటి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం. 8 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఉండే ఫుడ్స్ తినాలనే కోరిక పెరుగుతుంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!