ఉదయాన్నే బొప్పాయి తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..
ఎందుకంటే బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మీ శరీరంలో వాపుని తగ్గిస్తాయి. తద్వారా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరైతే మొలల వ్యాధితో బాధపడుతున్నారో వారికి బొప్పాయి పండు ఒక వరం. బొప్పాయిలో ఉండే ఫైబర్ మొలలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొందరూ

ప్రతిరోజు ఉదయం లేవగానే బొప్పాయి పండు తింటే మీ లివర్ కు చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. బొప్పాయి పండు మీ లివర్ ను డిటాక్సిఫై చేసేందుకు ఉపయోగపడుతుంది. మలబద్ధకంతో బాధపడుతున్నారు వారికి బొప్పాయి పండు ఒక వరం అనే చెప్పవచ్చు. బొప్పాయి పండు తింటే ఇందులోని ఫైబర్ వల్ల పేగుల్లో కదలికలు జరిగి మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు తినగలిగే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సైతం ఈ పండును తినవచ్చు.
బొప్పాయి పండులో పెద్ద మొత్తంలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్ మీ కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. బొప్పాయిలో ఉండే పొటాషియం రక్తంలో ఉండే సోడియం నిలువలను తగ్గిస్తుంది. ఇలా చేయడం ద్వారా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. బొప్పాయి పండును తినడం వల్ల థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం తగ్గించుకునే అవకాశం లభిస్తుంది.
బొప్పాయి పండును మీరు తినడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి కూడా బయటపడవచ్చు. ఎందుకంటే బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మీ శరీరంలో వాపుని తగ్గిస్తాయి. తద్వారా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరైతే మొలల వ్యాధితో బాధపడుతున్నారో వారికి బొప్పాయి పండు ఒక వరం. బొప్పాయిలో ఉండే ఫైబర్ మొలలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొందరూ బొప్పాయి ఖాళీ కడుపుతో తినొద్దని చెబుతారు. బొప్పాయిలో పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పండులో ఎంజైమ్‌లు బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. శరీరం డీటాక్స్ ప్రక్రియ ఉదయం పూట చాలా చురుగ్గా ఉంటుంది. బొప్పాయి ఈ ప్రక్రియలో సహాయపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








