Mushroom Coffee: మష్రూమ్ కాఫీ.. లాభాలు తెలుస్తే అసలు వదిలిపెట్టరు..!
ఇవి శరీరంలోని తెల్ల రక్త కణాలను సక్రియం చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటం ద్వారా సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మష్రూమ్ కాఫీలో విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తి స్థాయిలను పెంచడంలో ఎక్కువ మేలు చేస్తుంది. అలసటను తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి, ఏకాగ్రత శక్తిని పెంచుతుంది. నోట్రోపిక్ సమ్మేళనాలను సయపడుతాయి.

‘మష్రూమ్ కాఫీ’ ఈ పేరు వినగానే మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఈ కాఫీతో అనేక ఆరోగ్య లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఔషధ పుట్టగొడుగుల నుంచి ఈ కాఫీని తయారు చేస్తారు. రీషి వంటి ఔషధ పుట్టగొడుగులతో చేసే కాఫీ… విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఆందోళనను తగ్గించడానికి సహాయపడతుందని నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగు కాఫీలో కార్డిసెప్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిజన్ వినియోగాన్ని పెంచుతాయి. అలసట, బలహీనత వంటి సమస్యలు తగ్గిపోతాయి.
ఔషధ పుట్టగొడుగులు రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి తోడ్పడతాయి. దీర్ఘకాలిక వాపు సమస్యలు, గుండె జబ్బుల వంటి సమస్యలను తగ్గిస్తాయి. పుట్ట గొడుగులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. చాగా, రీషి వంటి పుట్టగొడుగులలో బీటా-గ్లూకాన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని తెల్ల రక్త కణాలను సక్రియం చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటం ద్వారా సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మష్రూమ్ కాఫీలో విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది. ఇది శక్తి స్థాయిలను పెంచడంలో ఎక్కువ మేలు చేస్తుంది. అలసటను తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి, ఏకాగ్రత శక్తిని పెంచుతుంది. నోట్రోపిక్ సమ్మేళనాలను సయపడుతాయి.
మష్రూమ్‌లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అవి రక్త నాళాలను రక్షించడంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మాష్రుమ్ కాఫీలో సాధారణ కాఫీ కంటే తక్కువ కెఫిన్ ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో తక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








