AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: చలికాలంలో మొలకెత్తిన పెసర్లను తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

మీరు ప్రతిరోజూ వర్కవుట్ చేస్తుంటే పెసర పదార్థాలను ఖచ్చితంగా తినాలి. మీరు ప్రతిరోజూ ఉదయం మొలకెత్తిన పెసర్లను తింటే, అది మీ శరీరంలో అవసరమైన ప్రోటీన్ల కొరతను తొలగిస్తుంది. కండరాలను

Health Tips: చలికాలంలో మొలకెత్తిన పెసర్లను తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Sprouted Moong Dal
Jyothi Gadda
|

Updated on: Dec 26, 2022 | 10:04 AM

Share

మొలకలు మన రోజువారీ ఆహారంలో అంతర్భాగం. దీని వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మొలకెత్తిన విత్తనాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల పెరుగుదలకు చాలా సహాయపడుతుంది. మీరు మీ రోజువారీ ఆహారంలో మొలకెత్తిన పెసర్లను చేర్చుకుంటే, మీరు దాని నుండి అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ప్రస్తుతం మొలకెత్తిన పెసర్లు, మూంగ్‌దాల్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే పెసర్లంటే అందరికీ ఇష్టమే. అలాంటి మొలకెత్తిన పెసెర్లతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

1. మొలకెత్తిన పెసర్లతో శరీరంలో పెరిగిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పనిచేస్తుంది. మీరు ప్రతిరోజూ ఉదయం మొలకెత్తిన పెసర్లను తింటే, అది మీ శరీరంలో అవసరమైన ప్రోటీన్ల కొరతను తొలగిస్తుంది. కండరాలను బలోపేతం చేయడంలో మీకు సహాయపడుతుంది.

2. పెసర్లలో విటమిన్ బి, సి, మాంగనీస్‌తోపాటు ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా పెసర్లు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యలు పెసర్లను ఆహారంగా తీసుకోవడం వల్ల తొలగిపోతాయి. ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

ఇవి కూడా చదవండి

2. సున్నిపిండి తయారీలో పెసర్లను ఉపయోగిస్తారు. దీని వల్ల చర్మంలో మృదుత్వం పెరుగుతుంది.

3. పెసర్లు హైబీపీని తగ్గిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. పెసర్లు తింటే ఆరోగ్యంతోపాటు చురుకుదనం కూడా వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

4. పెసరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణం సులువుగా అయ్యేందుకు సహాయపడే ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. రోజు వారీ ఆహారంలో పెసర్లను భాగం చేసుకుంటే అనీమియా తదితర వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

5. బరువు తగ్గాలనుకునే వారికి పెసర్లు అద్భుతంగా ఉపయోగపడతాయని పరిశోధకులు అంటున్నారు. రోజూ బియ్యంలో కొన్ని పెసర్లను కలిపి పులగం చేసుకుని తింటే ఊహించని రీతిలో బరువు తగ్గవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. డయాబెటిస్‌ను క్రమబద్దీకరించడానికి పెసర్లు ఉపయోగపడతాయి. క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయి.

6. పెసర్లు తినడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బ తినదు. కండరాల నొప్పి, తలనొప్పి, నీరసాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది. రోజు వారీ మెనూలో పెసర్లు ఉండడం వల్ల శరీరంలోని అనవసరమైన కెమికల్స్ నాశనం అవుతాయి. కంటి చూపు సమస్యలు దరి చేరవు.

7. మీరు ప్రతిరోజూ వర్కవుట్ చేస్తుంటే పెసర పదార్థాలను ఖచ్చితంగా తినాలి. దీని వల్ల రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది. కండరాల రికవరీ వేగంగా ఉంటుంది. ఈ పప్పు తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తొలగిపోయి రక్తహీనత వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి