Mushroom Chicken Masala: మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ.. ఇలా చేసి చూడండి.. బయట ఫుడ్ కి గుడ్ బై చెప్పేస్తారు..
పుట్టగొడుగులు, చికెన్ రెండూ ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఆహార పదార్దాలే.. ఈ రెండిటిని కలిపి రకరకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. చికెన్ పుట్టగొడుగుల సాస్, పుట్టగొడుగుల చికెన్ మీట్‌బాల్స్, పుట్టగొడుగుల చికెన్ కర్రీ, పుట్టగొడుగుల చికెన్ ఫ్రైడ్ రైస్ వంటి టేస్టీ టేస్టీ కూరలు చెసుకోవచ్చు. ఈ రోజు నాన్ వెజ్ రెసిపీస్ లో భాగంగా మష్రూమ్స్ చికెన్ మసాలా కర్రీ తయారీ తెలుసుకుందాం..

Mushroom Chicken Masala
చికెన్, లేదా పుట్ట గొడుగులతో రోజూ ఇదేనా అంటూ ఇంట్లో కుటుంబ సభ్యులు తినడానికి మారం చేస్తుంటే.. రెగ్యులర్ ఫుడ్ కి భిన్నంగా రెస్టారెంట్స్ లో దొరికే మష్రూమ్ చికెన్ మసాలా కర్రీని ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ప్రయత్నించండి. మీరు రెస్టారెంట్ ఫుడ్ తినాలనే మాటే మర్చిపోతారు. అవును చికెన్ ప్రియులు చాలా కొత్త వంటకాలను ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఖచ్చితంగా ఈ మష్రూమ్ చికెన్ డిష్‌ను ఇష్టపడతారు. చికెన్ , పుట్టగొడుగులకు మసాలా తగిలితే ఆ రుచే వేరు. కనుక ఈ రోజు మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ రెసిపీని గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు
- చికెన్- 500 గ్రాములు,
- పుట్టగొడుగులు -250 గ్రాములు,
- ఉల్లిపాయ- రెండు
- టమోటా- రెండు
- పచ్చిమిర్చి- నాలుగు
- బే ఆకు – రెండు
- యాలకులు – మూడు
- మిరియాలు- ఐదు
- దాల్చిన చెక్క -చిన్న ముక్క
- ధనియాల పొడి- ఒక టీస్పూన్,
- జీలకర్ర పొడి- ఒక టీస్పూన్,
- అల్లం-వెల్లుల్లి- పేస్ట్ ఒక టీస్పూన్,
- పసుపు అర టీస్పూన్,
- కారం పొడి ఒక టీస్పూన్
- ఉప్పు- , రుచికి తగినంత
- వంట నూనె- నాలుగు నుంచి ఐదు స్పూన్లు
చికెన్ మష్రూమ్ మసాలా తయారీ విధానం
- ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి వంటకు సిద్ధం చేసుకోవాలి.
- పుట్టగొడుగులను కూడా ఉప్పు వేసి కడిగి.. కాండాన్ని తొలగించాలి.
- ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేడి చేసి, చికెన్ ను నూనెలో వేసి వేయించాలి.
- మరో పాన్ లో నూనె వేడి చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చిదనం పోయిన తర్వాత, టొమాటో ప్యూరీ లేదా పేస్ట్ వేసి వేయించాలి.
- టొమాటో ఉడికిన తర్వాత.. అందులో బే ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి. పసుపు పొడి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి వేయించాలి.
- ఈ మసాలా దినుసులన్నీ బాగా వేయించాలి. నూనె బయటకు రాగానే ఇప్పుడు పుట్టగొడుగులు వేసి కొంతసేపు వేయించాలి.
- పుట్టగొడుగులు ఉడకడం మొదలయ్యాక కొంచెం ఉప్పు వేయాలి. వేయించిన చికెన్ కూడా వేయాలి.
- చివరిగా నీళ్లు పోసి మూతపెట్టి 20 నిమిషాలు ఉడికించాలి. కూర నుంచి నూనె విడివడిన తర్వాత గ్యాస్ ఆపివేయాలి. అంతే చికెన్ మష్రూమ్ మసాలా రెడీ.
- రుచికరమైన స్పైసీ చికెన్ మష్రూమ్ మసాలాను వేడి వేడిగా అన్నంతో కానీ, చపాతీ, పరాటా వంటి వాటితో కలిపి తినవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..