AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: ఈ టిప్స్ పాటించండి.. కాలీఫ్లవర్, క్యాబేజీలో ఒక్క పురుగు కూడా ఉండదు..

ప్రతి ఒక్కరి వంటగదిలో కూరగాయలను చాలా జాగ్రత్తగా చూస్తుంటారు. అందులో చిన్న పుచ్చు కనిపించినా.. కొద్దిగా చెడిపోయినా వెంటనే పక్కన పెట్టేస్తారు. అయితే ఎంతో ఖరీదైనవిగా మారిన తర్వాత వాటిని చెత్తబుట్టలో పడేయడం అంత మంచిది కాదు. కొంత శ్రేద్ధ పెట్టాలి. అందులో పుచ్చులు ఉంటే జాగ్రత్తగా వేరు చేయాలి. అందులోనూ ఈ వర్షాకాలంలో కాలీఫ్లవర్, క్యాబేజీ నుంచి పచ్చి కూరగాయల వరకు పురుగులు, తెగుళ్లు సోకుతున్నాయి. ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం..

Kitchen Tips: ఈ టిప్స్ పాటించండి.. కాలీఫ్లవర్, క్యాబేజీలో ఒక్క పురుగు కూడా ఉండదు..
Cabbage And Cauliflower
Sanjay Kasula
|

Updated on: Aug 13, 2023 | 11:42 AM

Share

ముఖ్యంగా వర్షాకాలంలో కూరగాయలు తెగుళ్లకు గురవుతాయి. కూరగాయలకు పురుగులు, తెగుళ్లు రావడం సర్వసాధారణం. కూరగాయల నుంచి పురుగులు, తెగుళ్ళను తొలగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే పురుగులు శరీరంలోకి చేరితే అనేక వ్యాధులు వస్తాయి. దీని కోసం, ప్రజలు కూరగాయలను కట్ చేసేముందు వాటిని సరిగ్గా కడగాలి. ఆపై వాటిని వండితే మంచిది. కానీ ఈ సీజన్ లో ఆకు కూరలు, కాలీఫ్లవర్, క్యాబేజీ లోపల ఎక్కువ పురుగులు ఉంటాయి. తరచుగా తెల్ల గొంగళి పురుగులు కూడా ఉన్నాయి. ఈ సమయంలో పురుగును తొలగించడం చాలా ముఖ్యం.

కాలీఫ్లవర్, క్యాబేజీ నుంచి పురుగులను ఎలా తొలగించాలో మనలో చాలా మందికి తెలియదు. అందులో ఉండే పరుగులను తొలిగించేందుకు చాలా కష్టపడుతాం. ఎందుకంటే పురుగులతో కలిపి వండలేం . అయితే కాలీఫ్లవర్, క్యాబేజీ నుంచి పురుగులను తొలగించడానికి ఈ రెండు విషయాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది మురికిని మాత్రమే కాకుండా పురుగులను కూడా క్లీన్ చేస్తుంది. అయితే ఇది ఎలా చేయాలో ఇక్కడ తెలుసకుందాం..

క్యాలీఫ్లవర్ నుంచి పురుగులను ఎలా తొలగించాలి

క్యాలీఫ్లవర్ నుండి కీటకాలు, పురుగులను తొలగించడానికి మీరు ఈ సాధారణ ట్రిక్ని ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం, మీరు ఎప్పుడైనా మార్కెట్ నుంచి క్యాలీఫ్లవర్ తీసుకొచ్చిన తర్వాత వాటిని ప్రత్యేకంగా కట్ చేయండి. అప్పుడు ఒక పాత్రలో ఉప్పు వేసి, 10 నుంచి 15 నిమిషాల పాటు క్యాలీఫ్లవర్‌ని ననబెట్టండి. ఇలా చేయడం వల్ల పురుగులన్నీ బయటకు వచ్చి డీహైడ్రేషన్ కారణంగా చనిపోతాయి. అప్పుడు ఫుల్వార్‌ను రెండు మూడు సార్లు శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ఫుల్వార్‌లో ఒక్క తెగులు కూడా ఉండదు.

క్యాబేజీ నుండి పురుగులను ఎలా తొలగించాలో తెలుసుకోండి

క్యాబేజీ నిండా పురుగులు ఉంటాయి. కాలీఫ్లవర్ నుండి పురుగులను సులభంగా తొలగించడానికి మొదటి రెండు పొరలను తొలగించండి. తర్వాత అన్ని ఆకులను ఒక్కొక్కటిగా కట్ చేసి వేరు చేయండి. ఇప్పుడు రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తీసుకోండి. తర్వాత గోరువెచ్చని నీటిలో క్యాబేజీ ఆకులను వేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత బయటకు తీసి శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల క్యాబేజీ ఆకులు పూర్తిగా శుభ్రమవుతాయి.

వర్షాకాలంలో కూరగాయలు కడగడం..

వర్షాకాలంలో కూరగాయలను సరిగ్గా కడగడం అలవాటు చేసుకోవాలి. దీని కోసం, రెండు గ్లాసుల వేడి నీటిలో వేసి, అందులో ఒక టీస్పూన్ పసుపు వేయండి. అప్పుడు కూరగాయలను ఉంచండి. 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల కూరగాయలు చాలా శుభ్రంగా తయారవుతాయి.

మరిన్ని హ్యూమన్ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం