New Year Party: న్యూ ఇయర్ పార్టీలో ఈ స్నాక్స్ చేశారంటే.. సూపర్ టేస్ట్ తో అందరి ప్రశంసలు మీకే

న్యూ ఇయర్ పార్టీ వరకూ ఓకే కానీ, పార్టీ సమయంలో చిరుతిళ్లు(స్నాక్స్) అనేవి పార్టీని వేరే స్థాయికి తీసుకెళ్తాయి. అయితే న్యూ ఇయర్ పార్టీలో మహిళల కోసం సింపుల్ గా పూర్తయ్యే స్నాక్ రెసిపీస్ ఇప్పుడు చూద్దాం.

New Year Party: న్యూ ఇయర్ పార్టీలో ఈ స్నాక్స్ చేశారంటే.. సూపర్ టేస్ట్ తో అందరి ప్రశంసలు మీకే
Snacks
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 30, 2022 | 3:04 PM

దేశంలో న్యూ ఇయర్ సందడి మొదలైంది. అందరూ పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. బ్యాచిలర్స్ అయితే వేకేషన్ కు వెళ్లడానికి ప్రిపేర్ అవుతారు. అయితే ఫ్యామిలీ ఉన్న వారైతే భార్యా, పిల్లలు, ఫ్రెండ్స్ తో పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ వరకూ ఓకే కానీ, పార్టీ సమయంలో చిరుతిళ్లు(స్నాక్స్) అనేవి పార్టీని వేరే స్థాయికి తీసుకెళ్తాయి. అయితే న్యూ ఇయర్ పార్టీలో మహిళల కోసం సింపుల్ గా పూర్తయ్యే స్నాక్ రెసిపీస్ ఇప్పుడు చూద్దాం.

సమోసా

అందరికీ తెలిసిన వంటకమే సింపుల్ గా, స్పీడ్ గా అయ్యే రెసిపీ. మసాల బంగాళదుంప కూరతో మధ్యలో స్టఫ్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం స్పీట్ కార్న్ సీజన్ కాబట్టి స్టఫింగ్ కు ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తో చాట్ మసాలా మిక్స్ చేసి సూపర్ గా సమోసా చేస్తే..అందరకూ టేస్ట్ అదుర్స్ అంటారు.

పకోడి

మన తెలుగు రాష్ట్రాల్లో అందరి ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసే వంటకం. ఉల్లిపాయ, శెనగపిండి, మసాల మిశ్రమంతో నూనెలో డీప్ ఫ్రై చేస్తే టేస్టీ పకోడీ రెడీ. దీన్ని కుటుంబం మొత్తం ఇష్టంగా తింటారు. 

పన్నీర్ టిక్కా

పన్నీర్ టిక్కా అనేది చిన్న చిన్న పన్నీర్ ముక్కలు, క్యాప్సికం, బంగాళదుంపల ముక్కలను ఒక పుల్లకు గుచ్చి గ్రిల్ చేసుకోవాలి. గ్లిల్ చేసుకునే సమయంలో నూనెల మసాల పొడి కలిపి దాన్ని రాసుకుంటూ గ్రిల్ చేస్తే టేస్టీ టేస్టీ పన్నీర్ టిక్కా రెడీ.

ఇవి కూడా చదవండి

చాట్

పిల్లలు ఇష్టంగా తినే వంటకం. ఫ్యామిలీతో ఎప్పుడు బయటకు వెళ్లినా కచ్చితంగా తినే ఆహారం. ఈ చాట్ చేయడం కూడా చాలా సింపుల్. ఉడకబెట్టిన బఠానీలు, బంగాళదుంపలు, వివిధ మసాలపొడులను మిక్స్ చేసి పాన్ పై ఫ్రై చేస్తూ వేడి వేడిగా సర్వ్ చేస్తే అందరూ ఇష్టంగా తింటారు.

పాప్ కార్న్..

చాలా ఈజీ అయిన రెసిపీ ఇది. మార్కెట్ లో ఇన్ స్టంట్ గా దొరికే పాప్ కార్న్ గింజలను తీసుకోవాలి. పాన్ లో నూనె పోసి వేడి చేయాలి అందులో కొంచె ఉప్పు, మసాల పొడి వేసి లైట్ గా ఫ్రై అవుతున్న సమయంలో పాప్ కార్న్ గింజలు వేసి వేయించాలి. పాప్ కార్న్ పేలే సమయంలో మూత వేసి ఉంచితే పాప్ కార్న్ రెడీ అయ్యిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.

బేల్ పూరి

పఫ్ట్ రైస్, కారప్పూస, పానీపూరి గొట్టాలు వంటివి వేసి ఇంట్లో టేస్టీగా చేసుకోవచ్చు. ఇందులో చాట్ కూడా వేసుకోవాలి కాబట్టి చాట్ తో పాటు చేసుకుంటే రెండు వెరైటీలతో న్యూ ఇయర్ వేడుకలు కుమ్మెయ్యచ్చు.

ఆలూ టిక్కి

ఉడికించిన బంగాళదుంపల్లో మైదా పిండి కలిపి వివిధ రకాలైన కూరగాయలు, మసాల పొడులు వేసి వడల్లాగా వేసుకోవాలి. వీటిని సాస్ లో ముంచుకుని తింటే సూపర్ గా ఉంటుంది. ఈ రెసిపీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..85