AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gutti Dondakaya Recipe: అబ్బా.. వంకాయను మరిపించే గుత్తి దొండకాయ.. ఈ మసాలా కాంబినేషన్‌తో వండితే అదరహో!

గుత్తి వంకాయ కూర అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ ప్రతిసారీ అదే ఏం తింటాం అనుకునేవారికి 'గుత్తి దొండకాయ ఫ్రై' ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. దొండకాయ అంటే కేవలం పప్పుచారులోకి నంచుకోవడానికో లేదా సాధారణ వేపుడుకో పరిమితం కాకుండా, ఇలా గుత్తి వంకాయ తరహాలో మసాలా దట్టించి వేపుడు చేస్తే దాని రుచి నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. ఇంట్లో వంకాయ లేనప్పుడు లేదా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్.

Gutti Dondakaya Recipe: అబ్బా.. వంకాయను మరిపించే గుత్తి దొండకాయ.. ఈ మసాలా కాంబినేషన్‌తో వండితే అదరహో!
Gutti Dondakaya Fry Recipe
Bhavani
|

Updated on: Feb 04, 2026 | 5:12 PM

Share

ఈ గుత్తి దొండకాయ ఫ్రై ప్రత్యేకత అంతా మనం తయారు చేసే మసాలా పొడిలోనే ఉంది. పల్లీలు, పుట్నాల పప్పు, శనగపిండి గరం మసాలాల కలయికతో చేసే ఈ స్టఫింగ్, దొండకాయకు ఒక క్రంచీ టేస్టీ కోటింగ్‌ను ఇస్తుంది. అన్నంలోకి కలుపుకోవడానికే కాకుండా, సైడ్ డిష్‌గా కూడా ఇది చాలా బాగుంటుంది. దొండకాయలు పచ్చగా, తాజాగా ఉన్నప్పుడు ఇలా మసాలా వేపుడు చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఆ నోరూరించే రెసిపీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు :

దొండకాయలు: పావు కేజీ

పల్లీలు, పుట్నాలపప్పు: పావు కప్పు చొప్పున

శనగపిండి: 2 టేబుల్ స్పూన్లు

అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్

మసాలాలు: కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా

పోపుకు: ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర

తయారీ విధానం :

ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి, గుత్తి వంకాయల మాదిరిగా మధ్యలోకి నాలుగు గాట్లు పెట్టుకోవాలి.

మసాలా పొడి తయారీ కోసం పల్లీలు, పుట్నాలపప్పును దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.

మిక్సింగ్ కి ఒక ప్లేట్‌లో పల్లీ-పుట్నాల పొడి, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా మరియు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.

స్టఫింగ్ కోసం సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమాన్ని దొండకాయ గాట్లలో గట్టిగా స్టఫ్ చేయాలి.

కడాయిలో ఆయిల్ వేసి, ఈ దొండకాయలను లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు మిగిలిన మసాలా పొడి వేసి మూత పెట్టి ఉడికించాలి.

ఫైనల్ టచ్ గా దొండకాయలు సాఫ్ట్‌గా ఉడికి, పైన క్రిస్పీగా మారాక కొత్తిమీర చల్లి దించేయాలి.