Methi Pulao Recipe: రెగ్యులర్ ఆహారంతో బోర్ కొట్టిందా.. క్షణాల్లో టేస్టీ గ్లూటెన్-ఫ్రీ మెంతి పులావ్ చేసుకోండి.. రెసిపీ మీ కోసం..
పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడ రోజూ ఒకే తరహా ఆహరం తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఒకొక్కసారి రోజూ ఇదేనా అంటూ మారం చేస్తారు కూడా.. ఈ నేపధ్యంలో క్యారెట్ రైస్, బీట్ రూట్ రైస్, కొత్తిమీర రైస్ వంటి సింపుల్ గా రకరకాల ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ రోజు ఆరోగ్యకరమైన, రుచికరమైన గ్లూటెన్-ఫ్రీ మెంతి పులావ్ రెసిపీ తెలుసుకుందాం..

ఆకు కూరల్లో మెంతి ఆకులు కూడా ఒకటి. ఈ మెంతి ఆకులు ఆరోగ్యకరమైనవిగా, పోషకమైనవిగా, రుచికరంగా ఉంటాయి. అంతేకాదు మెంతి ఆకులతో పప్పు, కూర, వంటి ఆహారాన్ని మాత్రమే కాదు మెంతి ఆకులతో రుచికరమైన పులావ్ ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రైస్ లంచ్ బాక్స్ లోని ఎంతో బాగుంటుంది. పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రోజు అప్పటికప్పుడు చేసుకునే “మేతి పులావ్” రెసిపీ గురించి తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు….
- మెంతి ఆకులు – 6కట్టలు
- బాస్మతి బియ్యం – రెండు కప్పులు
- పచ్చి బఠానీ గింజలు – ఒక కప్పు
- పచ్చిమిర్చి – 4
- బిర్యానీ ఆకు -1
- లవంగాలు – 4
- యాలకులు – 2
- అల్లంవెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
- జీలకర్ర 1 టీ స్పూన్
- పసుపు -పావు టీ స్పూన్
- జీడిపప్పు – 15
- నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
- నీళ్ళు – రెండు కప్పులు
- ఉప్పు- రుచికి సరిపడా
తయారీ విధానం: ముందు బాస్మతీ బియ్యం ఒక గిన్నెలోకి తీసుకుని నానబెట్టుకోవాలి. సుమారు గంట పాటు ఈ బియ్యం నానాలి. మెంతి ఆకులను కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దళసరి గిన్నె పెట్టుకుని అందులో నెయ్యి వేసి వేడి చేసి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి.. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు, జీడి పప్పు వేసి వేయించుకోవాలి. కడిగిన మెంతి ఆకులు కొంచెం పసుపు వేసి బాగా వేయించాలి. పూర్తిగా ఆకులు మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యం నీరు లేకుండా వేసి కొంచెం వేయించాలి. తర్వాత పచ్చి బఠానీ వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమం వేగిన తర్వాత రెండు కప్పుల నీరు పోసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిశ్రమాన్ని బాగా కలిపి ఒకసారి రుచి చూసుకోవాలి. తర్వాత మంటని మీడియంలో పెట్టి సుమారు 15నిముషాలు ఉడికించాలి. అంతే టేస్టీ టేస్టీ మెంతి పులావ్ రెడీ.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..