Food: రాత్రి మిగిలిపోయిన అన్నం పడేస్తున్నారా.? రైస్ కట్లట్ చేస్తే ఎగబడి తింటారు
రాత్రుళ్లు అన్నం మిగలడం ప్రతీ ఇంట్లో జరిగే సర్వసాధారణమైన విషయం. అయితే మనలో చాలా మంది రాత్రి మిగిలిన అన్నాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించం దీంతో చేసేది ఏమి లేక ఉదయం చెత్తలో పడేస్తుంటారు. అయితే మిగిలిన అన్నంతో చీజ్ రైస్ కట్లెట్ చేసుకుంటే ఎంతో ఇష్టపడి తింటారు. చిన్నారులతో పాటు పెద్దలకు నచ్చే...

రాత్రుళ్లు అన్నం మిగలడం ప్రతీ ఇంట్లో జరిగే సర్వసాధారణమైన విషయం. అయితే మనలో చాలా మంది రాత్రి మిగిలిన అన్నాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపించం దీంతో చేసేది ఏమి లేక ఉదయం చెత్తలో పడేస్తుంటారు. అయితే మిగిలిన అన్నంతో చీజ్ రైస్ కట్లెట్ చేసుకుంటే ఎంతో ఇష్టపడి తింటారు. చిన్నారులతో పాటు పెద్దలకు నచ్చే ఈ డిష్‌ను ఎలా చేసుకోవాలి.? ఇందుకోసం ఏం ఏం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు..
* 1 కప్పు అన్నం
* 1/2 కప్పు ఉడకబెట్టి మొత్తగా చేసిన మొక్కజొన్న
* 2 టేబుల్ స్పూన్ల రవ్వ
* తగినంత పసుపు, ఉప్పు
* రెండు టేబుల్ స్ఫూన్ల ఆలివ్ నూనె
* ఒక పెద్ద ఉల్లిపాయ
* ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్
* 1/2 టీస్పూన్ ఎర్ర కారం పొడి
* 1/2 టీస్పూన్ కొత్తిమీర పొడి
* కొన్ని పనీర్ ముక్కలు
తయారీ విధానం..
చీజ్ రైస్ కట్లెట్ తయారీ కోసం ముందుగా ఒక పాత్రను తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అనంతరం అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం వేయించాలి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసి, మిక్స్ చేసి, ఉల్లిపాయ గోల్డ్ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అనంతరం బాణిలో ఉడికించిన మెత్తని స్వీట్ కార్న్ వేయాలి. అందులో కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగాల కలపాలి. అనంతరం ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి బాగా మగ్గనివ్వాలి.
ఒక గిన్నెలో కూరగాయల మిశ్రమాన్ని ఉంచండి, వేయించిన 2 టేబుల్ స్పూన్ల రవ్వను యాడ్ చేయాలి. మిశ్రమంగా గట్టిగా మారుంది. అనంతరం ఆ మిశ్రమంతో చిన్న చిన్న కట్లెట్స్‌ను తయారు చేసుకోవాలి. వాటి మధ్యలో ఒక చిన్న చీజ్‌ను నింపాలి. అనంతరం ఒక పాత్రను తీసుకొని అందులో కాస్త నూనె వేసి కట్లెట్‌లను వేయించాలి. రెండు వైపులా వేయించి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే రుచికరమైన చీజ్ రైస్ కట్లెట్ రడీ అయినట్లే.
మరిన్ని ఫుడ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..