రోడ్డు పక్కన గుత్తులుగా కాయలతో కనిపించే ఈ మొక్క..! పిచ్చి పండ్లు అనుకుంటే పొరపాటే..! వందల వ్యాధులకు దివ్యౌషధం..

కొంతమంది వీటిని విరిగి చెట్టు, న‌క్కెర‌, బంక న‌క్కెర, బంక కాయ‌లు, బంక కాయ‌ల చెట్టు ఇలా అనేక ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. విరిగి పండ్లలో ప్రోటీన్, క్రూడ్ ఫైబర్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ మరియు కాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి. దీనితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇన్ని పోషకాలు కలిగిన బంకపండ్లను తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రోడ్డు పక్కన గుత్తులుగా కాయలతో కనిపించే ఈ మొక్క..! పిచ్చి పండ్లు అనుకుంటే పొరపాటే..! వందల వ్యాధులకు దివ్యౌషధం..
Nakkera Fruit
Follow us

|

Updated on: May 27, 2024 | 7:16 AM

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రకాల ఔషధ మొక్కలు నిండివున్నాయి. పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రకృతి ఒడిలో పుట్టిన మరో ఔషధగని నక్కెర కాయల చెట్టు. ఈ చెట్టు చాలా చోట్ల రోడ్లవెంట విరివిగా కనిపిస్తుంది. చెట్టునిండా పళ్ళతో ఉండే ఈ చెట్టును పిచ్చి చెట్టు అనుకుని కొంతమంది పట్టించుకోరు. కానీ ఈ మొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఈ చెట్టు నుంచి వచ్చే పండ్లు ఔషధ గుణాలకు ప్రసిద్ధి. ఈ పండుతో చేసిన ఊరగాయలు, కూరలు అద్భుత రుచి కలిగి ఉంటాయి. ఈ నక్కెర పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కొంతమంది వీటిని విరిగి చెట్టు, న‌క్కెర‌, బంక న‌క్కెర, బంక కాయ‌లు, బంక కాయ‌ల చెట్టు ఇలా అనేక ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. విరిగి పండ్లలో ప్రోటీన్, క్రూడ్ ఫైబర్, కార్బోహైడ్రేట్, కొవ్వు, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ మరియు కాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి. దీనితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇన్ని పోషకాలు కలిగిన బంకపండ్లను తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. విరిగి కాయ‌ల చెట్టు మూడు నుండి నాలుగు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ విరిగి చెట్టుకు కాయ‌లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. విరిగి కాయ‌లు ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు ఆకుప‌చ్చ రంగులో, అలాగే పండిన త‌రువాత లేత ఎరుపు రంగులోకి మారుతాయి. వీటి కాయ‌ల లోప‌ల కండ క‌లిగి సాగే గుణంతో తీపి పదార్థం ఉంటుంది. అందుకే దీనిని బంక కాయ‌ల చెట్టు అని పిలుస్తారు. ఈ విరిగి కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని తినడం మూలంగా డయాబెటిస్ అదుపులోకి వస్తుందని పరిశోధనలలో రుజువైంది. ఈ పండ్లు తినడం మూలంగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ అవుతుంది. మలబద్ధకం అజీర్తి గ్యాస్ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వర్షాకాలంలో చర్మంపై కురుపులు రావడం సర్వసాధారణం. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ బంక చెట్టు ఆకులను మెత్తగా నూరుకుని ప్రభావిత చర్మంపై రాస్తే ఉపశమనం పొందుతారు. దురద, అలెర్జీ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ మొక్క సహాయపడుతుంది. ఇందుకోసం ఈ నక్కెర పండ్ల గింజలను మెత్తగా రుబ్బుకుని దురద ఉన్న చోట రాస్తే ఉపశమనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

గొంతు నొప్పిని తగ్గించడానికి ఈ చెట్టు బెరడు కషాయం పనిచేస్తుంది. ఇందులో బెరుడు నీటిలో వేసి మరిగించి, దానిని వడపోసి త్రాగాలి. రుచి కోసం నల్ల మిరియాలు, తేనెను కలుపుకోవచ్చు. ఇది మీ గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాదు, ఈ చెట్టు బెరడు కషాయం మహిళలకు పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం అందిస్తుంది.

కొన్ని పదార్థాలు తిన్న తర్వాత చాలా మందికి చిగుళ్లు, పంటి నొప్పి మొదలవుతాయి. ఇది మొత్తం నోటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల నోటిపూత కూడా నయమవుతుంది. నోటి ఆరోగ్యం కోసం నక్కెర చెట్టు బెరడు పొడిని తీసుకుని, రెండు కప్పుల నీటిలో కలిపి, మరిగించి, ఈ పానీయం తాగాలి. లేదంటే ఈ కషాయంతో నోటిని పుక్కిల్లించిన కూడా ఫలితం ఉంటుంది. దీంతో పంటి నొప్పి, అల్సర్లు, చిగుళ్ల వాపులు అన్నీ మాయమవుతాయి.

ఆర్థరైటిస్‌తో బాధపడేవారిలో కీళ్ల నొప్పుల నుండి గ్లుబెర్రీ రెగ్యులర్ వినియోగం ఉపశమనం కలిగిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఈ గ్లూబెర్రీ పండ్లు, ఆకులు అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు.. మీ వయస్సు కంటే ముందే మీ జుట్టు బూడిద రంగులోకి మారుతున్నట్లయితే, బంక చెట్టు మీకు వంటింటి ఔషధంగా పనిచేస్తుంది.. దీని పండ్ల నుండి తీసిన రసాన్ని జుట్టు మీద అప్లై చేయడం వల్ల నెరిసిన జుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీరు ఈ పండ్ల రసాన్ని నూనెతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమంతో తలనొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ పండ్లు అర‌గ‌డానికి ఎక్కువ సమ‌యం ప‌డుతుందట.  కనుక వీటిని త‌క్కువ మోతాదులో రోజుకు 5 నుండి 10 విరిగి పండ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు