Cardamom Water: ఈ వ్యాధులు ఉన్నవారు యాలకుల నీరు తాగొచ్చా ? శరీరంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకొండి..

మన భారతీయ వంటశాలలో ఉండే మసాల దినుసులు అనేక వ్యాధులను నయం చేయగలవని తెలిసిన విషయమే. ఎన్నో సంవత్సరాల

Cardamom Water: ఈ వ్యాధులు ఉన్నవారు యాలకుల నీరు తాగొచ్చా ? శరీరంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకొండి..
Cardamom Water
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 13, 2021 | 12:10 PM

మన భారతీయ వంటశాలలో ఉండే మసాల దినుసులు అనేక వ్యాధులను నయం చేయగలవని తెలిసిన విషయమే. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మసాల దినుసులను ఆయుర్వేదంలో కొన్ని వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా యాలకులు. వీటి వలన మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. కేవలం వంటలలో రుచిని పెంచడమే కాకుండా.. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలోనూ సహయపడతాయి. అంతేకాదు… యాలకులను తినడం వలన నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇక యాలకుల నీరు ప్రతి రోజూ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి.

ఒక లీటర్ నీటిలో 5 యాలకులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయానే వాటిని గోరువెచ్చని నీటితో కలిపి తాగాలి. ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు తాగొచ్చు. ప్రయోజనాలు.. 1. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ సహయపడుతుంది. ఇది శరీరంలోని రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 2. యాలకుల నీరు తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. డయాబెటిక్ రోగులు ఈ నీటిని తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే శరీర అలసటను తగ్గిస్తుంది. 3. యాలకుల నీరు తాగడం వలన జీర్ణవ్యవస్థ బలపడుతుంది. కడపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 4. ఇవే కాకుండా.. యాలకుల నీరు వివిధ రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. బరువును తగ్గించడంలోనూ సహయపడుతుంది.

Also Read: Sundeep Kishan’s Gully Rowdy: మెగాస్టార్ చేతుల మీదుగా సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ మూవీ ట్రైలర్v

Varsha Bollmma: లక్కీ ఛాన్స్ అందుకున్న యంగ్ హీరోయిన్.. పుష్ప మూవీలో వర్ష బొల్లమ్మ.. ఏ రోల్ అంటే..