Horse Grams: వారెవ్వా.. ఉలవలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా?

Horse Gram Benefits: ఉలవలు నవధాన్యాలలో ఒకటి. ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఈ ఉలవలను పేదవారు మాత్రమే గుగ్గిళ్లుగానో లేదా చారుగానో చేసుకుని తినేవారు. అయితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు తినే ఆహారపదార్ధాల్లో..

Horse Grams: వారెవ్వా.. ఉలవలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా?
Horse Grams
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 13, 2021 | 11:57 AM

Horse Gram Benefits: ఉలవలు నవధాన్యాలలో ఒకటి. ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఈ ఉలవలను పేదవారు మాత్రమే గుగ్గిళ్లుగానో లేదా చారుగానో చేసుకుని తినేవారు. అయితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా మారింది.  మ‌న దేశంలో వీటి పేరు తెలియ‌ని వారుండ‌రు.  అంతేకాదు ఇప్పుడు ఉలవలతో చేసిన వంటకాలు అత్యంత ఖరీదైనవి.  ఇప్పుడు విందు వినోదాలలో వాడడం స్టేటస్‌ సింబల్‌ గా భావిస్తున్నారు.  అంతేకాదు తెలుగు వారికీ ఇప్పుడు ఉలవ గుగ్గిళ్ళు, ఉలవచారు ప్రియమైన వంటకాలుగా మారిపోయాయి. ఇక ఈ ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. ఉలవలను చారుగా,  ఉడకపెట్టి గుగ్గిళ్ల గా కూడా తీసుకుంటారు. ప్రతి 100 గ్రాముల ఉలవ గుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు బోలెడంత పీచుపదార్థమూ లభిస్తుంది. ఎదిగే వయసు పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం మరొకటి లేదు. ఈరోజు ఉలవలను తినడంవలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

*ఉలవలు ఆకలిని పెంచుతాయి *ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి మేలు చేస్తాయి. * దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకొన్నవారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. *ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి. *అకారణంగా కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలున్న వారు ఉలవలతో చేసిన అహారం తీసుకుంటే చక్కని గుణం కనిపిస్తుంది. *మూత్రంతో మంటతో ఇబ్బంది పడేవారు  ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం లభిస్తుంది. *మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది. *ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం లేనేలేదు. *కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. *త్వరగా బరువు తగలనుకునేవారికి ఉలవలు మంచి సహాయకారి. ముందుగా మంచి ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేయించి, చల్లారిన తరువాత పిండిపట్టుకొని రోజూ పరగడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే తొందరగా బరువు తగ్గుతారు. * నెలసరి రెగ్యులర్ గా రాని మహిళలు ఉలవలను తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన నెలసరి రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు. *ఉలవలు దెబ్బతిన్న కాలేయాన్ని కోలుకునేలా చేస్తాయి. *ఉల‌వ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండడం వల్ల శ‌రీరానికి చ‌క్కని పోష‌ణ‌ను అందిస్తాయి. *ఉలవల్లో ఫైబ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, ర‌క్త‌పోటు నియంత్రణలో ఉంటాయి

అయితే ఈ ఉలవలు ఎక్కువగా తీసుకోవడం వలన వేడి చేసే గుణం ఉంటుంది. కనుక ఉలవలు తిన్నరోజున తగినంత మజ్జిగ కూడా తీసుకుంటే వేడి చేయదు.  ఉలవలను నేరుగా తినేదాని కంటే ఉడికించి, మొలకలెత్తించి లేదా వేయించి పొట్టు తీసితిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది. ఇక వీటిని ఉలవలను కనీసం 8 గంటల పాటు నానబెడితేనే పూర్తిగా నానతాయి.

Also Read: Bad Food Combinations: ఆహారపదార్ధాలను .. వేరే పదార్ధాలతో కలిపి తినకూడదట… ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏమిటో చూద్దాం..

టాలీవుడ్ ఫ్యూచర్ ఏంటి.. ఏం చేయబోతున్నారు ??
టాలీవుడ్ ఫ్యూచర్ ఏంటి.. ఏం చేయబోతున్నారు ??
ఎద్దుల పోరులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఓడిపోయింది..! ఏటీఎం ధ్వంసం
ఎద్దుల పోరులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఓడిపోయింది..! ఏటీఎం ధ్వంసం
అన్‌స్టాపబుల్‌కు ఆ ఫ్యామిలీ హీరో.. ఎన్టీఆర్ 31పై నీల్ క్లారిటీ..
అన్‌స్టాపబుల్‌కు ఆ ఫ్యామిలీ హీరో.. ఎన్టీఆర్ 31పై నీల్ క్లారిటీ..
సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..
సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..
మీకు ఉద్యోగం లేకున్నా.. సులభంగా వ్యక్తిగత రుణం పొందవచ్చు..!
మీకు ఉద్యోగం లేకున్నా.. సులభంగా వ్యక్తిగత రుణం పొందవచ్చు..!
అరె.! ఏంట్రా ఇది.. మగ టీచర్‌కు ప్రసూతి సెలవులు..నవ్వుకుంటున్న జనం
అరె.! ఏంట్రా ఇది.. మగ టీచర్‌కు ప్రసూతి సెలవులు..నవ్వుకుంటున్న జనం
'సినిమాలను వదిలేయాలనుకుంటున్నా'! సుకుమార్ షాకింగ్ కామెంట్స్
'సినిమాలను వదిలేయాలనుకుంటున్నా'! సుకుమార్ షాకింగ్ కామెంట్స్
ఆ ఈవీలకు గట్టిపోటీ తప్పదా..? మార్కెట్‌‌లోకి బజాజ్‌ స్కూటర్‌
ఆ ఈవీలకు గట్టిపోటీ తప్పదా..? మార్కెట్‌‌లోకి బజాజ్‌ స్కూటర్‌
అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? రియాక్షన్ ఇదే
పుష్ప2 చూసేందుకు పోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిన స్మగ్లర్
పుష్ప2 చూసేందుకు పోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిన స్మగ్లర్