Instant Dosa: దోశ తినాలని ఉందా.. పప్పు, బియ్యం నానబెట్టకుండానే ఇన్‌స్టంట్ దోశలను ఇలా వేసుకోండి..
ఆర్డర్ టిఫిన్‌ను కాసేపు పక్కన పెడితే.. రోజు మనం తినే టిఫిన్‌లో ఇడ్లీ, దోశ, వడా.. వీటిని ఇంట్లో చేయాలంటే ముందుగానే పిండిని రెడీ చేసుకోవాలి. వీటిని అంతా ఇష్టంగా తింటారు.

రేపు ఉదయం ఏ టిఫిన్ తింటే బాగుంటుందా అని మందుగానే ప్లాన్ చేసేవారు గతంలో.. అదే ఇప్పుడు అంతా రెడీ మెంట్.. ఇలా ఫోన్ తీసుకోవాలి.. అలా ఆర్డర్ చేయాలి. ఇది ఇప్పుడు జరుగుతున్న టిఫిన్ తయారి. అయితే ఆర్డర్ టిఫిన్‌ను కాసేపు పక్కన పెడితే.. రోజు మనం తినే టిఫిన్‌లో ఇడ్లీ, దోశ, వడా.. వీటిని ఇంట్లో చేయాలంటే ముందుగానే పిండిని రెడీ చేసుకోవాలి. వీటిని అంతా ఇష్టంగా తింటారు. దోశలు తినడానికి రుచిగా ఉన్నప్పటికీ దోశ పిండిని తయారు చేయడం మాత్రం కొద్దిగా పనితో కూడిన వ్యవహారం. దోశ పిండిని తయారు చేసుకునే సమయం కూడా అందరికీ ఉండి ఉండదు. ఎందుకంటే అంతా ఏదో పనిలో బిజీగా ఉండటమే. అలాంటి వారి కోసం కేవలం 15 నిమిషాల్లోనే ఎలాంటి శ్రమ లేకుండా ఎంతో రుచిగా ఉండే దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఇన్ స్టాంట్‌గా దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అకస్మాత్తుగా దోశ తినాలని అనిపిస్తే.. మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ పద్దతిలో దోశ వేసుకోవచ్చు. దోశ చేయడానికి మీరు బియ్యం, మినపప్పును నానబెట్టి వాటిని పులియబెట్టాలి. ఇలాకాకుండా వెంటనే దోశ తినాలని అనిపిస్తే.. మీరు దీన్ని వెంటనే తయారు చేసి తినలేరు. కానీ ఇప్పుడు మీకు ఆ చింతి అవసరం లేదు. మీరు ముందుగా చేయాల్సిదల్లా.. కొద్దిగా పెరుగు, పోహాతో(అటుకులు) సులభంగా తక్షణ దోశను తయారు చేసుకోవచ్చు. ఇలా దోశ చేయడానికి బియ్యంలో అటుకులు, పెరుగు కలిపి పిండి తయారు చేసుకోవాలి. బియ్యం,పెరుగుతో దోస చేసే వంటకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దోస తయారీకి కావలసిన పదార్థాలు
- బియ్యం 1 కప్పు
- పోహా(అటుకులు) అర కప్పు
- పెరుగు అర కప్పు
- మినుపప్పు 2 టేబుల్ స్పూన్లు
- మెంతులు గింజలు 1 టీ స్పూన్లు
- చక్కెర 1/2 టీ స్పూన్లు
- అవసరమైనంత నూనె
- నీరు, రుచికి ఉప్పు
అటుకులతో దోశ తయారీ రెసిపీ..
- దోశ చేయడానికి, ముందుగా ఒక పాత్రలో బియ్యం, మినుపప్పు, మెంతి గింజలను నీటిలో వేసి కడగండి.
- దీని తర్వాత మీరు మరొక గిన్నెలో అటుకులను కూడా కడగాలి.
- కడిగిన అటుకులను బియ్యం పాత్రలో వేసి, 1 1/2 కప్పుల నీరు జోడించిన తర్వాత 4-5 గంటలు నానబెట్టండి.
- దీని తరువాత, నానబెట్టిన బియ్యం, అన్ని వస్తువులను గ్రైండర్ జార్లో ఉంచండి.
- ఇప్పుడు దానికి పెరుగు, కొద్దిగా నీరు వేసి పిండిని తయారు చేయండి. పిండి మందంగా ఉన్నట్లు అనిపిస్తే, కొంచెం ఎక్కువ నీరు కలపండి.
- ఇప్పుడు ఈ పిండిలో చక్కెర(అవసరమైతే), ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు సుమారు 10-12 నిమిషాలు అలా వదిలివేయండి.
- దోశ చేయడానికి.. మీడియం మంట మీద గ్రిడిల్ వేడి చేయండి. ముందుగా కొద్దిగా నూనెతో గ్రిడ్‌ను గ్రీజ్ చేయండి.
- ఇప్పుడు దోశ చేయడానికి పిండిని పెనంపై వేయండి.. అలా గుండ్రగా వేయండి.
- దోశ లేత బంగారు గోధుమ రంగులోకి మారినప్పుడు, దానిని తీయండి.
- మీరు కొబ్బరి చట్నీతో వేడి వేడి దోశను మీ ఇంట్లోనివారికి వడ్డించవచ్చు.
మరో రకంగా కూడా ఇన్ స్టాంట్ దోశను వేయవచ్చు..
- బొంబాయి రవ్వ – ముప్పావు కప్పు
- గోధుమ పిండి – అర కప్పు
- బియ్యం పిండి – పావు కప్పు
- పెరుగు – అర కప్పు
- నీళ్లు – తగినన్ని
- ఉప్పు – తగినంత
- వంటసోడా – పావు టీ స్పూన్
ఇలా కూడా చాలా ఈజీగా ఇన్ స్టాంట్ దోశ వేయవచ్చు. ఓసారి మీరు కూడా ట్రై చేయండి.
మరిన్ని వంటల న్యూస్ కోసం




