Health Tips: బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసేవారిలో గుండెకు ముప్పు… అధ్యయనాల్లో కీలక విషయాలు..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బ్రెక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తున్నారు. దీంతో గ్యాస్ సమస్య.. మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బ్రెక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తున్నారు. దీంతో గ్యాస్ సమస్య.. మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలా ఉదయం బ్రెక్ ఫాస్ట్ తినకుండా ఉండేవారిపై ఓహీయో స్టేట్ యూనివర్సిటీ అధ్యాయనం నిర్వహించింది. ప్రోసీడింగ్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ సొసైటీ జర్నల్ లో ప్రచురితమైన కథనం ప్రకారం.. ఉదయం అల్పాహారం తినకుండా ఉండేవారు పోషకాలు కోల్పోయే అవకాశం ఉందని తేలింది. దాదాపు 30 వేల మందిపై నిర్వహించిన వారిలో.. బ్రెక్స్ ఫాస్ట్, పాలు స్కిప్ చేయడం వలన కాల్షియం లోపం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. విటమిన్ సి తోపాటు.. విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ డి, ఐరన్ లోపం ఏర్పడుతున్నట్లుగా వెల్లడైంది.
విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా బ్రెక్ ఫాస్ట్ స్కిప్ చేసేవారు ఎక్కువగా కేలరీలతో కూడిన ఆహారంతోపాటు, షుగర్, కొవ్వులు ఎక్కువగ ఉండే పదార్థాలను తింటున్నారని స్టెఫానీ ఫానెల్లి, ఎంఎస్ , ఆర్డిఎన్, ఎల్డి రచయిన ఒకరు అన్నారు. ఇలా బ్రెక్ ఫాస్ట్ స్కిప్ చేసేవారు క్రమంగా బరువు పెరగడమే కాకుండా.. గుండె సంబంధ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడైంది. ప్రస్తుతం కాల్షియం, పోటాషియం, ఫైబర్, విటమిన్ డి వంటి పోషకాలు చాలా మందికి ముఖ్యం. మధ్యాహ్నం, రాత్రిళ్లు చేసే భోజనం కంటే ఎక్కువగా ఉదయం తీసుకునే అల్పాహారంలో అనేక రకాల పోషకాలు, ఖనిజాలు శరీరానికి లభిస్తాయని స్పష్టమైంది. ఫోలేట్, థియామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ ఎ, విటమిన్ డితో సహా అనేక పోషకాలు బలవర్థకమైన అల్పాహారం ఆహారాల ఉత్పత్తి అని OSU మెడికల్ డైటెటిక్స్ ప్రొఫెసర్, అధ్యయనం ప్రధాన పరిశోధకుడు క్రిస్ టేలర్ వివరించారు.
కానీ తృణ ధాన్యాలు, పాలు, పండ్ల నుంచి లభించే విటమిన్లు, ఖనిజాలు ఉదయం తీసుకునే ఆహారంలోనే లభిస్తాయని అన్నారు. ఒక వేళ ఉదయం తీసుకునే అల్పాహారంలో కేలరీలు ఎక్కువ ఉన్నప్పటికీ అవి. ఆరోగ్యానికి హాని చేయవని .. రోజంతా ఉత్సహాంగా ఉంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Also Read: Sapota Benefits: సపోటాలో ఎన్నో పోషకాలు.. ఈ పండుతో అలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?
Ginger Side Effects: అల్లం ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయాలు తెలుసుకోండి