AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..! తక్కువ కేలరీలున్న ఈ 6 ఫుడ్స్ ట్రై చేయండి

ఈ రోజుల్లో ఊబకాయం సమస్య ప్రజలలో సాధారణమైపోంది. దీంతో అనేక వ్యాధులకు నిలయంగా మారుతున్నాయి. తక్కువ కెలరీలు ఉన్న ఈ 6 ఆహార పదార్థాలను తింటే మంచి ఫలితం ఉంటుంది.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..! తక్కువ కేలరీలున్న ఈ 6 ఫుడ్స్ ట్రై చేయండి
Health Foods
Venkata Chari
|

Updated on: Sep 10, 2021 | 2:37 PM

Share

Weight Loss Tips: జీవనశైలిలో మార్పులతో ఈ రోజుల్లో స్థూలకాయం పెద్ద సమస్యగా మారింది. ఊబకాయం మీ శరీరాన్ని పాడుచేయడమే కాకుండా అనేక శారీరక వ్యాధులకు ప్రధాన కారణంగా మారుతోంది. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, థైరాయిడ్ వంటి అన్ని జీవనశైలి వ్యాధులకు స్థూలకాయం కూడా ఒక ప్రధాన కారణం అని పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాధుల నుంచి మీ శరీరాన్ని రక్షించుకోవాలనుకుంటే, పెరిగిన బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. దీని కోసం ముందుగా మీరు మీ ఆహారాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకంటే కేవలం ఆహారాన్ని నియంత్రించడం ద్వారానే అనేక సమస్యలు దూరమవుతాయి. అలాగే వేగంగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తక్కువ కేలరీలు ఉన్న ఈ 6 ఆహారాలను కచ్చితంగా తినాల్సిందే.

1. ఓట్స్ 40 గ్రాముల ఓట్స్‌లో 148 కేలరీలు, 5.5 గ్రాముల ప్రోటీన్, 3.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్స్ కరిగేవి. ఇవి మీ కడుపులోని నీటిని పీల్చుకుని జెల్ రూపంలో మారుతుంది. దీని కారణంగా, మీకు ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. అతిగా తినడం నుంచి తప్పించుకోవచ్చు. అందువల్ల, ఓట్స్ బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతమైనవిగా పనిచేస్తాయి.

2. గుడ్లు బరువు తగ్గడానికి గుడ్లు కూడా చాలా ఉపయోగపడుతాయి. 7 నుంచి 8 వారాల పాటు ప్రతిరోజూ అల్పాహారంలో ఉడికించిన గుడ్లను తినడం వల్ల మీ బరువు 65 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతుంటారు. మీకు మరిన్ని మంచి ఫలితాలు కావాలంటే, గుడ్లతో పాటు మొలకలను అల్పాహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

3. పాప్‌కార్న్ మీకు ఆకలి అనిపించినప్పుడల్లా వేపుడు పదార్థాల జోలికి పోకుండా ఉండాలి. వాటి బదులు పాప్‌కార్న్ తినండి. బరువును తగ్గించడంలో పాప్‌కార్న్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. 8 గ్రాముల పాప్‌కార్న్‌లో 31 కేలరీలు, 1.2 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. దీనిని తినడం ద్వారా కడుపు కూడా ఉపశమనం పొందుతుంది.

4. పెరుగు పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి 12, ప్రోబయోటిక్స్ ఉంటాయి. 150 గ్రాముల గ్రీక్ పెరుగును రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటే, బరువు వేగంగా తగ్గుతారు. ఇందులో అధిక కాల్షియం ఉంటుంది. ఇది ఆహారంలో ఉండే కొవ్వు కణాలలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది.

5. పనీర్ బరువు తగ్గాలనుకునే వారికి ముడి పనీర్ మంచి ఎంపిక. 100 గ్రాముల పనీర్‌లో 163 ​​కేలరీలు, 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కాకుండా, మీ బరువును నియంత్రించడానికి అవసరమైన అన్ని అంశాలు పనీర్‌లో ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే, రోజూ మీ ఆహారంలో సుమారు 100 గ్రాముల ముడి పనీర్‌ను చేర్చండి.

6. యాపిల్స్ ప్రతీ వ్యక్తి ప్రతిరోజూ ఒక పండు తినాలి. ఎందుకంటే మీ శరీర అవసరాలన్నీ కేవలం పండ్ల ద్వారా మాత్రమే నెరవేరుతాయి. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఆహారంలో యాపిల్స్ చేర్చండి. యాపిల్స్‌లో తక్కువ కేలరీలు, మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మీ బరువును వేగంగా తగ్గించడమే కాకుండా అన్ని వ్యాధుల నుంచి కూడా రక్షించేందుకు సహాయం చేస్తుంది.

Also Read:

Sleep Aid Device: మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా..? ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చే పరికరం

Fitness Tips: మీరు జిమ్‌కు వెళ్తున్నారా? ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!