Dengue Fever: ప్రతి జ్వరం డెంగు కాదు.. డెంగు జ్వరం లక్షణాలు.. తీసుకోవాల్సిన చికిత్స, నివారణ చర్యలు ఏమిటంటే..

Dengue Fever-Ayurvedic Treatment: ప్రస్తుతం ఓవైపు కరోనా మరోవైపు సీజనల్ వ్యాధులు.. వీటికి తోడు డెంగు ఫీవర్ .. దీంతో ఏ జ్వరం ఏమిటో తెలియక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం ఏ జ్వరం వచ్చినా డెంగు అని భయపడాల్సిన..

Dengue Fever:  ప్రతి జ్వరం డెంగు కాదు.. డెంగు జ్వరం లక్షణాలు.. తీసుకోవాల్సిన చికిత్స, నివారణ చర్యలు ఏమిటంటే..
Dengue Fever,
Follow us
Surya Kala

|

Updated on: Sep 09, 2021 | 9:20 PM

Dengue Fever-Ayurvedic Treatment: ప్రస్తుతం ఓవైపు కరోనా మరోవైపు సీజనల్ వ్యాధులు.. వీటికి తోడు డెంగు ఫీవర్ .. దీంతో ఏ జ్వరం ఏమిటో తెలియక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం ఏ జ్వరం వచ్చినా డెంగు అని భయపడాల్సిన పనిలేదు.. డెంగు కి కొన్ని లక్షణాలను సూచిస్తున్నారు. అంతేకాదు చికిత్స లేని ఈ  జ్వరానికి నివారణ ఒక్కటే మార్గమని తెలుపుతున్నారు. అయితే డెంగు సోకినా వారందరికీ రక్తకణాల సంఖ్య తగ్గుతాయని భయం అవసరం లేదని అంటున్నారు.

 డెంగు జ్వరం లక్షణాలు: 

హఠాత్తుగా జ్వర తీవ్రత ఎక్కువ అవుతుంది. తలనొప్పి ముఖ్యంగా నొసటి మీద నొప్పి అధికంగా ఉంటుంది. కన్ను కదిలితే నొప్పి అనిపించడం.. కంటి కదలికలు తగ్గుతాయి కండరాలు, కీళ్ళ నొప్పి అధికమవుతాయి వాంతులు అవుతున్న ఫీలింగ్ నోరు ఎండిపోయి.. దాహం అధికంగా ఉండడం

ఈ లక్షణాలు కనిపించినవారు వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన విధంగా చికిత్స తీసుకోవాలి. వెంటనే సంబంధిత ఆరోగ్య శాఖాధికారులకు వెంటనే తెలియజేయాలి.

ఈ డెంగు ఫీవర్ పట్టపగలు ఏడిస్ ఈజిప్టై అనే దోమ కాటు వలన వస్తుంది. అంతేకాదు ఒకరి నుండి మరొకరికి అనే దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది. ఈ రకమైన దోమలు మన ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. కనుక   నీరు నిల్వ ఉండకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్, పూలకుండీల క్రింద గల సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్, ఖాళీ డ్రమ్ములు ఎప్పటి కప్పుడు శుభ్రపరచాలి.  అంతేకాదు సన్ షేడ్స్ పై  బిల్డింగ్ ల  వాన నీరు నిల్వలేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  ఇక వ్యక్తి గత జాగ్రత్తలు కూడా తప్పని సరిగా పాటించాలి.  దోమతెరలు, నివారణ మందులు వాడాలి. పిల్లలు, పెద్దలు శరీర భాగాలకు దోమల నుంచి రక్షణ ఇచ్చే దుస్తులను ధరించాలి.

చికిత్స : డెంగు జ్వరం వచ్చినవారిలో కొంతమందికి రక్తకణాల సంఖ్య తగ్గుతాయి.  కనుక ఈ ప్లేట్‌లెట్ల గురించి అవగాహన పెంచుకోవటం అవసరం.  మన రక్తంలో తెల్లకణాలు, ఎర్రకణాలతో పాటు ప్లేట్‌లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డకట్టటంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్‌లెట్‌ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావటానికి దారితీస్తుంది. అయితే ఒకొక్కసారి బ్లడ్ టెస్ట్ లో ప్లేట్ లెట్స్ లెక్కల్లో తప్పులు రావచ్చు.. కనుక ఈ పరీక్షను ఒకటికి రెండు సార్లు చేయించుకోవాలి.  ముఖ్యంగా * చర్మం మీద చిన్న చిన్న చుక్కల్లాంటి రక్తపు మచ్చలు ఉన్నట్టు కనిపించినా , చిన్న దెబ్బకు కూడా చర్మం కందిపోయినా , రక్తస్రావం ఆపకుండా జరుగుతున్నా.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డెంగు సోకిన రోగికి విశ్రాంతి అవసరం,  జ్వరానికి , నొప్పులకు తగిన మందులను ఇస్తూనే మరేవిధమైన బాక్టీరియల్ ఇంఫెక్షన్‌ రాకుండా  యాంటిబయోటిక్ ను ఇస్తారు. అంతేకాదు  పౌస్టికాహారము , అన్ని వేడి చేసి తినాలని సూచిస్తారు. ఇక ఈ రోగి కారం  , పులుపు , మసాలా ఆహారానికి దూరంగా ఉండాలని సూచిస్తారు. మూలికావైద్యం:  డెంగ్యూ జ్వరానికి అద్భుతమైన చికిత్స విధానం మూలికా వైద్యం.  చౌక అయింది. తేలికగా అందరికీ అన్ని చోట్లా లభించేది.  ముఖ్యంగా బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ తో పాటు పర్పుల్‌ రంగులో ఉండే చిలగడదుంప ఆకుల కషాయం సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనికి పలు శాస్త్రీయమైన కారణాలు ఉన్నయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

 బొప్పాయిరసం : బొప్పాయి కాయ మనిషికి ప్రకృతి అందించిన కానుక. దీని ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగీ వ్యాధిని నివారించవచ్చు.

రక్తకణాలు 80 వేల కంటే తగ్గితే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి.  రోగికి రక్తకణాల సంఖ్య 30 వేల వరకు ఉన్నా, డెంగీ కాకుంటే ప్రమాదం ఉండదనీ, చికిత్సతో తిరిగి రెండు మూడు రోజుల్లో సాధారణ స్థితికి వస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:: అతిరథమహారధులు మధ్య రామ్ చరణ్ శంకర్ మూవీ ప్రారంభోత్సవం.. వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి

Revenue Deficit Grant: జగన్ ప్రభుత్వానికి ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. భారీగా రెవెన్యూ లోటు భర్తీ నిధులు విడుదల

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..