AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton Biryani Recipe: రెస్టారెంట్ స్టైల్ లో మటన్ బిర్యనీని ఇలా చేయండి.. మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..

చాలా మంది ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ తినాలని కోరుకుంటారు. అయితే ఇంట్లో ఎన్ని రకాలుగా చేసినా సరే రెస్టారెంట్ లో ఉన్నట్లు లేదని పిల్లలు తరచుగా పిర్యాదు చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇంట్లో తయారుచేసే బిర్యానీ అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు.. దాని వాసన పొరుగువారిని కూడా ఆకర్షిస్తుంది. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ లో మటన్ బిర్యానీ తయారు చేసే సులభమైన పద్ధతి తెలుసుకుందాం..

Mutton Biryani Recipe: రెస్టారెంట్ స్టైల్ లో మటన్ బిర్యనీని ఇలా చేయండి.. మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..
Mutton Biryani Recipe
Surya Kala
|

Updated on: Sep 21, 2025 | 10:33 AM

Share

మటన్ బిర్యానీ అంటే మాంసాహార ప్రియులకు ఖచ్చితంగా నొరూరుతుంది. చాలా మంది మటన్ బిర్యనీని హోటళ్ళు లేదా రెస్టారెంట్లలో మాత్రమే ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఇంట్లో మటన్ బిర్యానీ చేసినా, రెస్టారెంట్లలో చేసే రుచి లేదని చెబుతారు. ఈ రోజు రెస్టారెంట్ కంటే మెరుగైన రుచితో ఇంట్లోనే మటన్ బిర్యనీని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు

  1. బాస్మతి బియ్యం – 500 గ్రాములు
  2. మటన్ – 500 గ్రాములు
  3. పెరుగు – 1 కప్పు
  4. ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి)
  5. అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
  6. బే ఆకులు-2
  7. దాల్చిన చెక్క- చిన్న ముక్క
  8. యాలకులు-3
  9. లవంగాలు- 4
  10. పచ్చిమిర్చి – 2
  11. కారం – 1 టీస్పూన్
  12. పసుపు – 1/2 టీస్పూన్
  13. గరం మసాలా – 1 టీస్పూన్
  14. నూనె- ౩ స్పూన్లు
  15. నెయ్యి – 2 స్పూన్లు
  16. కొత్తిమీర
  17. పుదీనా
  18. ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం: ముందుగా మటన్ ను బాగా శుభ్రంగా కడిగి.. ఒక గిన్నెలోకి మటన్ ముక్కలు తీసుకుని పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి. కనీసం గంటసేపు ఈ మటన్ ని పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి దళసరి పెద్ద గిన్నె పెట్టుకుని నూనె, నెయ్యి వేసి వేడి చేసి మసాలా దినుసులు బే ఆకులు, దాల్చిన చెక్క,యాలకులు, లవంగాలు వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఈ మసాలా మిశ్రమంలో మ్యారినేట్ చేసిన మటన్ వేసి.. గరం మసాలా, మటన్ కొద్దిగా ఉడికినంత వరకు తక్కువ మంట మీద ఉడికించాలి.

ఇలా మటన్ 80 శాతం వరకూ ఉడికించుకోవాలి. అవసరమైతే కొంచెం నీరు జోడించవచ్చు.

మరోస్టవ్ మీద గిన్నె పెట్టి బియ్యాన్ని 70% ఉడికేంత వరకు ఉడకబెట్టండి.

ఇప్పుడు అడుగున మందంగా ఉన్న కుండ తీసుకుని దానిలో బిర్యానీని పొరలు పొరలుగా వేయడం మొదలు పెట్టండి. ఉడికిన బియాన్ని మొదటి పొరగా వేయండి. ఆ తరువాత బియ్యంపై ఉడికించుకున్న మటన్, ఆపై దానిపై పుదీనా,యు కొత్తిమీర చల్లుకోండి. ఇలా రెండు లేదా మూడు పొరలుగా పొరలు వేసుకోండి..

చివరిగా పైన కొంచెం కుంకుమ పువ్వు లేదా ఫుడ్ కలర్ వేసి మూత పెట్టి 20-25 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించండి.

అంతే రుచికరమైన మటన్ బిర్యానీ సిద్ధంగా ఉంది. దీన్ని రైతాతో కానీ మీకు నచ్చిన కూరతో కాని తో సర్వ్ చేయండి. మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..