AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vellulli Kodi Guddu Pachadi: వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి ఇలా తిన్నారంటే.. అస్సలు వదిలి పెట్టరు!

ఇప్పటి వరకూ చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల నిల్వ పచ్చళ్లు తిన్నారు కానీ.. కోడి గుడ్డు పచ్చడి ఎప్పుడూ తిని ఉండరు. అసలు కోడి గుడ్డుతో కూడా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. కోడి గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటారు. కర్రీస్, స్నాక్స్ ఇలా చాలా వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోడి గుడ్డు పచ్చడి రెసిపీ కూడా ఒక్కసారి తింటే.. అస్సలు వదిలి పెట్టరు. దీన్ని తయారు చేసుకోవడం కూడా సింపుల్. ఏమీ తినాలని లేనప్పుడు..

Vellulli Kodi Guddu Pachadi: వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి ఇలా తిన్నారంటే.. అస్సలు వదిలి పెట్టరు!
Vellulli Kodi Guddu Pachadi
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 27, 2024 | 2:30 PM

Share

ఇప్పటి వరకూ చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల నిల్వ పచ్చళ్లు తిన్నారు కానీ.. కోడి గుడ్డు పచ్చడి ఎప్పుడూ తిని ఉండరు. అసలు కోడి గుడ్డుతో కూడా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. కోడి గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలు తినే ఉంటారు. కర్రీస్, స్నాక్స్ ఇలా చాలా వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోడి గుడ్డు పచ్చడి రెసిపీ కూడా ఒక్కసారి తింటే.. అస్సలు వదిలి పెట్టరు. దీన్ని తయారు చేసుకోవడం కూడా సింపుల్. ఏమీ తినాలని లేనప్పుడు ఈ పచ్చడి వేసుకుని తింటే.. తృప్తిగా ఉంటుంది. ఈ పచ్చడి దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. స్పైసీ వంటలు అంటే ఇష్టం ఉండేవారు ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వెల్లుల్లి కోడి గుడ్డు పచ్చడి ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వెల్లుల్లి కోడి గుడ్డు నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన గుడ్లు, వెల్లుల్లి, నిమ్మ రసం, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ఇంగువ, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు మిర్చి, జీలకర్ర పొడి.

వెల్లుల్లి కోడి గుడ్డు నిల్వ పచ్చడి తయారీ విధానం:

కోడి గుడ్లు ఉడక పెట్టి.. పొట్టు తీసి లోపల ఉన్న పచ్చ సొనను తీసి పక్కన పెట్టుకోవాలి. గుడ్డు తెల్ల భాగాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న గుడ్డు ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వెల్లుల్లి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు మిర్చి వేసి నీరు వేసి పేస్ట్‌గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో చిటికెడు ఇంగువ, మిక్సీ పట్టిన పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత గుడ్డు ముక్కలను కూడా వేసి కలపాలి. మంటను సిమ్‌లో పెట్టి చేయాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపు కోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. వేయించిన మిశ్రమం కూడా చల్లారేంత వరకూ పక్కన పెట్టాలి. ఆ తర్వాత నిమ్మ రసం వేసి బాగా కలిపి.. సర్వ్ చేసుకుని తినడమే. నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.