AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton keema Sandwich: కీమా సాండ్‌విచ్ ఇలా చేస్తే.. ఎవరైనా ఇంకొకటి కావాలంటారు..

సాండ్ విచ్ అనగానే పిల్లలే కాదు పెద్దలు కూడా ఎగిరి గంతేస్తారు. అయితే సాండ్ విచ్ ఎప్పుడూ బయటే కాకుండా ఇంట్లో కూడా హెల్దీగా తయారు చేసుకోవచ్చు. సాండ్ విచ్ వైట్ బ్రెడ్‌తో కంటే బ్రైన్ బ్రెడ్‌తో తింటేనే ఆరోగ్యానికి మంచిది. సాండ్ విచెస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా బయట వెజ్ సాండ్ విచెస్ తింటూ ఉంటారు. సాండ్ విచెస్ ఇంట్లో కూడా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేశారంటే..

Mutton keema Sandwich: కీమా సాండ్‌విచ్ ఇలా చేస్తే.. ఎవరైనా ఇంకొకటి కావాలంటారు..
Mutton Keema Sandwich
Chinni Enni
|

Updated on: Jul 13, 2024 | 7:23 PM

Share

సాండ్ విచ్ అనగానే పిల్లలే కాదు పెద్దలు కూడా ఎగిరి గంతేస్తారు. అయితే సాండ్ విచ్ ఎప్పుడూ బయటే కాకుండా ఇంట్లో కూడా హెల్దీగా తయారు చేసుకోవచ్చు. సాండ్ విచ్ వైట్ బ్రెడ్‌తో కంటే బ్రైన్ బ్రెడ్‌తో తింటేనే ఆరోగ్యానికి మంచిది. సాండ్ విచెస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా బయట వెజ్ సాండ్ విచెస్ తింటూ ఉంటారు. సాండ్ విచెస్ ఇంట్లో కూడా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేశారంటే.. మీకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చెప్పే సాండ్ విచ్‌ని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో ఎప్పుడైనా తినవచ్చు. స్నాక్స్ గా తీసుకోవచ్చు. మరి ఈ కీమా సాండ్ విచ్ ఎలా తయారు చేస్తారు? కీమా సాండ్ విచ్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కీమా సాండ్ విచ్‌కి కావాల్సిన పదార్థాలు:

మటన్ లేదా చికెన్ కీమా, బ్రౌన్ బ్రెడ్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, బటర్.

కీమా సాండ్ విచ్‌ రెసిపీ తయారీ విధానం:

ఈ సాండ్ విచ్‌కి మటన్ లేదా చికెన్ కీమా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు తాయరు చేసే రెసిపీ మటన్ కీమాతో. ముందుగా కీమా శుభ్రం కడిగి పక్కన పెట్టాలి. ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఉల్లి పాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, గరం మసాలా, శుభ్రం చేసిన మటన్ కీమా అన్నీ వేసి ఓ ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఆవిరి పోయాక అన్నీ ఒకసారి రుచి చూసుకుని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దానిపై కొద్దిగా బటర్ లేదా నెయ్యి వేసి వేడి చేశాక.. మీరు తీసుకున్న బ్రెడ్‌ని పాన్ పై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకుని దానిపై ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోవాలి. దానిపై ఉడికించిన కీమా పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా, క్యాప్సికమ్ ముక్కలు ఉంచాలి. కావాలి అనుకుంటే మయోనీస్, టమాటా కిచప్ వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచిగా ఉండే కీమా సాండ్ విచ్ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి,

Follow Us