Coconut Milk Chicken Pulao: కొబ్బరి పాలతో చికెన్ పులావ్.. రుచి అదిరిపోతుంది అంతే..

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. నాన్ వెజ్‌లో ఎక్కువగా అందరూ తినేది చికెనే. దీంతో చాలా రకాల ఐటెమ్స్ తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పులావ్, బిర్యానీలు, ఫ్రై ఐటెమ్స్ ఎక్కువగా తింటారు. మరింత ఆరోగ్యంగా కొబ్బరి పాలతో కూడా చికెన్ పులావ్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇది వండుతుంటే వచ్చే వాసనకు తినాలన్నా కోరిక ఇంకా పెరిగి పోతుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. మరి ఈ టేస్టీ కొబ్బరి పాల..

Coconut Milk Chicken Pulao: కొబ్బరి పాలతో చికెన్ పులావ్.. రుచి అదిరిపోతుంది అంతే..
Coconut Milk Chicken Pulao
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 21, 2024 | 9:51 AM

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. నాన్ వెజ్‌లో ఎక్కువగా అందరూ తినేది చికెనే. దీంతో చాలా రకాల ఐటెమ్స్ తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పులావ్, బిర్యానీలు, ఫ్రై ఐటెమ్స్ ఎక్కువగా తింటారు. మరింత ఆరోగ్యంగా కొబ్బరి పాలతో కూడా చికెన్ పులావ్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇది వండుతుంటే వచ్చే వాసనకు తినాలన్నా కోరిక ఇంకా పెరిగి పోతుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. మరి ఈ టేస్టీ కొబ్బరి పాల చికెన్ పులావ్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి పాల చికెన్ పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:

కొబ్బరి పాలు, చికెన్, బాస్ మతీ రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బిర్యానీ దినుసులు, పసుపు, ఉప్పు, కారం, నెయ్యి లేదా నూనె, పెరుగు, నిమ్మ రసం.

కొబ్బరి పాల చికెన్ పులావ్‌ తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన చికెన్‌లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, పుదీనా, కొత్తిమీర, కారం వేసి బాగా కలిపి మ్యారినేట్ చేయాలి. ఇలా ఓ గంట పాటు అయినా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాస్ మతీ రైస్‌ని ఓ గంట పాటు అయినా నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టి అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేయాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసులు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికి కాస్త గ్రేవీలా అవుతుంది. ఇప్పుడు కొబ్బరి పాలు వేసి కలుపు కోవాలి. ఆ తర్వాత రైస్, పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలుపి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కోసారి చూస్తూ ఉండాలి. చివరగా పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాల చికెన్ పులావ్ సిద్ధం.

కొబ్బరి పాలతో చికెన్ పులావ్.. రుచి అదిరిపోతుంది అంతే..
కొబ్బరి పాలతో చికెన్ పులావ్.. రుచి అదిరిపోతుంది అంతే..
భగవద్గీత శ్లోకాల పఠనంలో గణపతి సచ్చిదానంద కృషి.. గిన్నిస్‌బుక్‌ రి
భగవద్గీత శ్లోకాల పఠనంలో గణపతి సచ్చిదానంద కృషి.. గిన్నిస్‌బుక్‌ రి
తమన్నా అలా చేస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది..
తమన్నా అలా చేస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది..
బడ్జెట్‌ సంస్కరణలకు పెద్దపీట వేస్తుందా? సంక్షేమానికి జై కొడుతుందా
బడ్జెట్‌ సంస్కరణలకు పెద్దపీట వేస్తుందా? సంక్షేమానికి జై కొడుతుందా
రెండు చోట్ల ఓనర్ ఒక్కడే.. ఇది మామూలు దందా కాదుగా..
రెండు చోట్ల ఓనర్ ఒక్కడే.. ఇది మామూలు దందా కాదుగా..
'కల్కి' టీమ్‌కు లీగల్ నోటీసులు.. ప్రభాస్‌కి కూడా.. కారణమిదే
'కల్కి' టీమ్‌కు లీగల్ నోటీసులు.. ప్రభాస్‌కి కూడా.. కారణమిదే
అయ్యయ్యో.. వంటల్లో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేయండి!
అయ్యయ్యో.. వంటల్లో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేయండి!
పవిత్ర ఆ విషయం చెప్పగానే నేను సంతోషంతో పొంగిపొయాను..
పవిత్ర ఆ విషయం చెప్పగానే నేను సంతోషంతో పొంగిపొయాను..
మీ బంగారు అభరణాలు నకిలీవా? ఒరిజినలా? ఇలా సులభంగా గుర్తించండి!
మీ బంగారు అభరణాలు నకిలీవా? ఒరిజినలా? ఇలా సులభంగా గుర్తించండి!
పవన్ కల్యాణ్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? యాక్టింగ్‌లో తోపు అంతే
పవన్ కల్యాణ్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? యాక్టింగ్‌లో తోపు అంతే