Bread Boorelu: బ్రెడ్ బూరెలు.. టేస్టీగానే కాకుండా ఈజీగా అయిపోతాయి..
తెలుగు వారి ఇంట్లో ఫంక్షన్ ఉందంటే.. ఖచ్చితంగా బూరెలు ఉండాల్సిందే. బూరెలకు, తెలుగు వారికి ఉండే అనుబంధమే వేరు. అలాగే దాదాపు అన్ని పండుగలకు కూడా బూరెలు ఖచ్చితంగా ఉండాల్సిందే. వీటినే ఎక్కువగా నైవేద్యంగా పెడతారు. అయితే ఈ బూరెలు తయారు చేయడం కాస్త శ్రమతో కూడిన పని. ఎందుకంటే పప్పు నానబెట్టి.. పిండి సిద్ధం చేయాలి. కానీ ఈ బూరెలను కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్‌తో ఈ బూరెలను..

తెలుగు వారి ఇంట్లో ఫంక్షన్ ఉందంటే.. ఖచ్చితంగా బూరెలు ఉండాల్సిందే. బూరెలకు, తెలుగు వారికి ఉండే అనుబంధమే వేరు. అలాగే దాదాపు అన్ని పండుగలకు కూడా బూరెలు ఖచ్చితంగా ఉండాల్సిందే. వీటినే ఎక్కువగా నైవేద్యంగా పెడతారు. అయితే ఈ బూరెలు తయారు చేయడం కాస్త శ్రమతో కూడిన పని. ఎందుకంటే పప్పు నానబెట్టి.. పిండి సిద్ధం చేయాలి. కానీ ఈ బూరెలను కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్‌తో ఈ బూరెలను తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇవి కూడా రుచికి ఏ మాత్రం తీసిపోవు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేస్తారు? ఈ బ్రెడ్ బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? అని ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ బూరెలకు కావాల్సిన పదార్థాలు:
బ్రెడ్, బొంబాయి రవ్వ, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, యాలకుల పొడి, ఆయిల్.
బ్రెడ్ బూరెలు తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టాలి. ఇందులో నెయ్యి వేసి జీడిపప్పులను ముక్కలుగా చేసి వేయించాలి. ఆ తర్వాత ఇందులో బొంబాయి రవ్వ వేసి వేయించు కోవాలి. బొంబాయి రవ్వను దోరగా వేయించాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని ముక్కలుగా కట్ చేసి అందులో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలి. బెల్లం నీటిలో పూర్తిగా కరిగా రవ్వ వేసి కలుపుతూ దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత ఇందులోనే వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, యాలకుల పొి వేసి మరోసారి బాగా కలపాలి. ఈ మిశ్రమం కాస్త చల్లా రాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.
ఇప్పుడు బ్రెడ్ తీసుకుని అంచులను కట్ చేయాలి. ఆ తర్వాత వీటిని నీటిలో ముంచి తీసి.. మధ్యలో ముందుగా చుట్టి పెట్టుకున్న రవ్వ ఉండలను ఉంచి చుట్టూ మూసేయాలి. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక చుట్టి పెట్టుకున్న ఉండలను వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ బూరెలు సిద్ధం. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.








